laggam: ‘లగ్గం’ కుదిరింది

సాయిరోనక్‌, గనవి లక్ష్మణ్‌ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘లగ్గం’. రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Updated : 06 Feb 2024 09:34 IST

సాయిరోనక్‌, గనవి లక్ష్మణ్‌ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘లగ్గం’. రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. రమేశ్‌ చెప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. వేణుగోపాల్‌ రెడ్డి నిర్మాత. సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైందీ చిత్రం. దర్శకుడు మాట్లాడుతూ ‘‘పెళ్లి చేసుకోవడం అంటే రెండు కుటుంబాలు కలవడం కాదు, రెండు మనసులు కలవడమని చెబుతూ... పెళ్లి ధావత్‌ ఇస్తున్నాం’’ అన్నారు.


రాజా ది రాజా ప్రారంభం

రుత్విక్‌ కొండకింది, విశాఖ దిమాన్‌ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘రాజా ది రాజా’. మణికాంత్‌ గెల్లి దర్శకత్వం వహిస్తున్నారు. చాణక్య అద్దంకి, నిహారిక రెడ్డి నిర్మాతలు. సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం. తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్లాప్‌నిచ్చారు. దర్శకులు రవిబాబు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఎస్వీ కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘థ్రిల్లింగ్‌ అంశాలున్న ఓ మంచి ప్రేమకథ ఇది’’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని