- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Sairam Shankar: సాయిరామ్ శంకర్.. ‘వెయ్ దరువెయ్’
సాయిరామ్ శంకర్ (Sairam Shankar), యషా శివకుమార్(Yasha Sivakumar) జంటగా... నవీన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వెయ్ దరువెయ్’(Vey Daruvey). దేవరాజ్ పొత్తూరు నిర్మాత. ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కథానాయకుడు శర్వానంద్(Sharwanand) క్లాప్‌నివ్వగా, అల్లరి నరేష్ కెమెరా స్విచ్చాన్ చేశారు. విష్వక్‌సేన్ (Vishwak Sen) గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ ‘‘ప్రేమ, యాక్షన్, సెంటిమెంట్‌తో కూడిన కథ ఇది. ఇదివరకు నేను చేసిన ‘బంపర్ ఆఫర్’ తరహాలో ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ ఉన్న కథ దొరకడం నా అదృష్టం. కథానాయిక పాత్ర కూడా బలంగా ఉంటుంది. ఒకే షెడ్యూల్‌లోనే చిత్రాన్ని పూర్తి చేసి, ఈ ఏడాదిలోనే విడుదల చేస్తాం’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఆద్యంతం హాస్యం పంచే కథ ఇది. వచ్చే నెలలో చిత్రీకరణ మొదలు పెడతాం’’అన్నారు. ‘‘బలమైన వినోదంతో కూడిన కథ ఇది. ‘ఎస్.ఆర్.కల్యాణమండపం’ సినిమాని విడుదల చేసిన శంకర్ పిక్చర్స్‌తో కలిసి నిర్మిస్తున్నాం’’ అన్నారు నిర్మాత. సినిమాలో నటిస్తున్న కాశీవిశ్వనాథ్‌తోపాటు...కథానాయకుడు ఆకాష్ పూరి, నిర్మాత కోడి దివ్య దీప్తి తదితరులు ఈ వేడుకకి హాజరయ్యారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (17/08/2022)
-
World News
Pak PM: ఆసియా టైగర్ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
-
India News
Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!
-
Sports News
IND vs ZIM : జింబాబ్వే వంటి జట్లతో ఆడటం.. ప్రపంచ క్రికెట్‌కు మంచిది!
-
Movies News
హృతిక్! ముందు నీ సినిమా సంగతి చూసుకో..
-
General News
Offbeat: 99ఏళ్ల బామ్మ.. 100వ మునిమనవడిని కలిసిన వేళ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Pak PM: ఆసియా టైగర్ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
- Dhanush: ధనుష్ రెమ్యునరేషన్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా?
- హృతిక్! ముందు నీ సినిమా సంగతి చూసుకో..
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!
- RRR: ఆస్కార్‌కు ‘ఆర్ఆర్ఆర్’.. నామినేట్ అయ్యే ఛాన్స్ ఎంతంటే?
- Offbeat: 99ఏళ్ల బామ్మ.. 100వ మునిమనవడిని కలిసిన వేళ!
- Ponniyin Selvan: ఆ ఫార్మాట్లో విడుదలవుతున్న తొలి తమిళ సినిమా!
- Hardik : హార్దిక్ ఫుల్ స్వింగ్‌లో ఉంటే భారత్‌ను తట్టుకోలేం: జింబాబ్వే బ్యాటింగ్ కోచ్
- Early Puberty: ముందే రజస్వల.. ఎందుకిలా?!