Salaar:ఖాన్సార్‌ ఎరుపెక్కాల...

ఖాన్సార్‌ వల్ల చాలామంది కథలు మారాయి. కానీ ఖాన్సార్‌ కథని మార్చింది ఇద్దరు ప్రాణ స్నేహితులు, వాళ్ల మధ్య శత్రుత్వం. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు? వాళ్లు శత్రువులుగా ఎందుకు మారారనేది తెలియాలంటే ‘సలార్‌’ చూడాల్సిందే.

Updated : 19 Dec 2023 09:21 IST

ఖాన్సార్‌ వల్ల చాలామంది కథలు మారాయి. కానీ ఖాన్సార్‌ కథని మార్చింది ఇద్దరు ప్రాణ స్నేహితులు, వాళ్ల మధ్య శత్రుత్వం. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు? వాళ్లు శత్రువులుగా ఎందుకు మారారనేది తెలియాలంటే ‘సలార్‌’ చూడాల్సిందే. ప్రభాస్‌ కథానాయకుడిగా హోంబలే ఫిలింస్‌ పతాకంపై తెరకెక్కిన చిత్రమిది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ముఖ్యభూమిక పోషించారు. శ్రుతిహాసన్‌ కథానాయిక. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించారు. ఈ నెల 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఖాన్సార్‌ అనే ప్రాంతం నేపథ్యంలో... దేవా, వరదరాజ పాత్రల చుట్టూ సాగే కథతో ఈ చిత్రం సాగుతుంది. దేవా పాత్రలో ప్రభాస్‌ కనిపించగా, వరదరాజ మన్నార్‌ పాత్రలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించారు. రెండు భాగాల్లో తొలి భాగమైన ‘సలార్‌ సీజ్‌ఫైర్‌’ రిలీజ్‌ ట్రైలర్‌ని సోమవారం విడుదల చేశారు. ‘ఖాన్సార్‌ ఎరుపెక్కాల... మండే నిప్పుతోనైనా, వీళ్ల రక్తంతోనైనా...’  అంటూ ప్రభాస్‌ చెప్పే సంభాషణలు, భారీ పోరాటాలు, ఖాన్సార్‌ ప్రపంచం ట్రైలర్‌కి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. యాక్షన్‌ ఘట్టాలే కాకుండా... అంతకుమించిన భావోద్వేగాలు ఈ సినిమాలో ఉంటాయని సినీవర్గాలు స్పష్టం చేశాయి. జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంగీతం: రవి బస్రూర్‌, ఛాయాగ్రహణం: భువన్‌గౌడ.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని