సల్మాన్‌ ‘అంతిమ్‌’ 60 రోజుల్లోనే!

బాలీవుడ్‌ స్టార్‌హీరో సల్మాన్‌ఖాన్‌ ప్రధాన  పాత్రలో ‘అంతిమ్‌’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  సిక్కు పోలీసు అధికారిగా సల్మాన్‌ నటిస్తుండగా చిత్ర కథ గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో  ఉండనుంది. జీ5లో వచ్చిన మరాఠీ క్రైమ్‌ డ్రామా ‘ముల్షీ’కి అనుసరణీయంగా

Published : 03 Feb 2021 03:03 IST

ముంబయి: బాలీవుడ్‌ స్టార్‌హీరో సల్మాన్‌ఖాన్‌ ప్రధాన  పాత్రలో ‘అంతిమ్‌’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సిక్కు పోలీసు అధికారిగా సల్మాన్‌ నటిస్తుండగా చిత్ర కథ గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో  ఉండనుంది. జీ5లో వచ్చిన మరాఠీ క్రైమ్‌ డ్రామా ‘ముల్షీ’కి అనుసరణీయంగా సల్మాన్‌ఖాన్‌ సొంత బ్యానర్‌ ఎస్‌కేఎఫ్‌లో నిర్మిస్తున్నారు.ప్రముఖ నటుడు, దర్శకుడు మహేష్‌ మంజ్రేకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ కేవలం  60 రోజుల్లోనే పూర్తి చేసేశారు. సల్మాన్‌ కేవలం 30 నుంచి 35 రోజుల మాత్రమే షూటింగ్‌లో పాల్గొన్నారు. గత పదేళ్లలో సల్మాన్‌ సినిమా ఇంత వేగంగా తెరకెక్కడం ఇదే మొదటిసారి. కొంత ప్యాచ్‌వర్క్‌ మిగిలి ఉండగా దానిని రెండురోజుల్లోనే పూర్తి చేస్తామని చిత్ర యూనిట్‌ అంటోంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ చిత్రం జూన్‌ తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది. సల్మాన్‌ సోదరి అర్పితాఖాన్‌ భర్త, నటుడు ఆయుష్‌శర్మ విలన్‌గా కనిపించనున్నారు. సల్మాన్‌ ‘టైగర్‌ 3’షూటింగ్‌ దశలో ఉండగా, ప్రభదేవా దర్శకత్వం వహించిన ‘రాధే ’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.  మరోపక్క షారుక్‌ ‘పఠాన్‌’చిత్రంలో ‘టైగర్‌’గా 15 నిమిషాల పాటు సల్మాన్‌ మెరవనున్నారు.

ఇవీ చదవండి!

ఆ వార్తలు చూసి షాకయ్యా: డైరెక్టర్‌ శంకర్‌

‘ఆదిపురుష్‌’ ఆరంభం అంటున్న ప్రభాస్‌!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని