Samantha: చెర్రీ-ఉప్సీల దారిలో చై-సామ్‌

ఓ వైపు సినిమా షూటింగ్స్, మరోవైపు బిజినెస్‌ మీటింగ్స్‌తో ఫుల్‌ బిజీగా ఉంటూ తరచూ హైదరాబాద్‌-ముంబయిల మధ్య ప్రయాణిస్తున్నారు స్టార్‌కపుల్‌ రామ్‌చరణ్‌-ఉపాసన....

Updated : 08 Jul 2021 10:51 IST

ముంబయికి మకాం మార్చనున్న జోడీ

హైదరాబాద్‌: ఓ వైపు సినిమా షూటింగ్స్, మరోవైపు బిజినెస్‌ మీటింగ్స్‌తో ఫుల్‌ బిజీగా ఉంటూ తరచూ హైదరాబాద్‌-ముంబయిల మధ్య ప్రయాణిస్తున్నారు స్టార్‌కపుల్‌ రామ్‌చరణ్‌-ఉపాసన. దీంతో ఈ జంట కొంతకాలం క్రితం ముంబయిలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసింది. కాగా, తాజాగా చెర్రీ-ఉప్సీల బాటలోనే చై-సామ్‌ సైతం అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ జంట కూడా ముంబయిలో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేయనున్నట్లు సమాచారం.

సమంత ఇప్పటికే ‘సాకీ’ పేరుతో ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. త్వరలోనే ఆమె నగల వ్యాపారంలోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో బిజినెస్‌లో మరిన్ని లాభాలు పొందేందుకు వీలుగా ముంబయికి మకాం మార్చాలనే ఉద్దేశంలో సామ్‌ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు నాగచైతన్య సైతం త్వరలోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆమిర్‌ఖాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘లాల్‌ సింగ్‌ చద్దా’లో చై కీలకపాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌-2’తో సామ్‌కూ బీటౌన్‌లో అవకాశాలు వరుస కట్టాయి. దీంతో ఇటు సినిమాలు.. అటు బిజినెస్‌ల్లో మరింత సక్సెస్‌ సాధించేందుకు ఈ జంట ముంబయిలో ఇల్లు కొనుగోలు చేయాలని భావిస్తోందిట. ఈ మేరకు సామ్‌ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారట.

ప్రస్తుతం సామ్‌ తెలుగులో తెరకెక్కుతోన్న ‘శాకుంతలం’లో నటిస్తున్నారు. గుణశేఖర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దీనితోపాటు ఆమె కోలీవుడ్‌లో ‘కాతువక్కుల రెందు కాదల్‌’లో నటిస్తున్నారు. మరోవైపు నాగచైతన్య కథానాయకుడిగా నటించిన ‘లవ్‌స్టోరీ’ మరికొన్నిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితోపాటు ‘థ్యాంక్యూ’ చిత్రంలో ఆయన నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని