ఓటు హక్కు ఆమె చలవే!

స్వదేశీ ఉద్యమ సమయంలో... ఓ పక్క ‘స్వరాజ్యం మా జన్మహక్కు’ అనే నినాదాలు వినిపిస్తుంటే, ఆమె మాత్రం ‘ఓటు హక్కు మా జన్మహక్కు’ అంటూ నినదించారు. భారతీయ మహిళలకు ఓటుహక్కు రావడం వెనుక మిథన్‌లామ్‌ పాత్ర కీలకం... మిథన్‌ సంపన్న పార్శీ కుటుంబంలో 1898లో పుట్టారు. తండ్రి అర్దేశిర్‌ బెజోంజీ టాటా, తల్లి హేరాబాయ్‌టాటా.

Updated : 29 Apr 2024 06:59 IST

స్వదేశీ ఉద్యమ సమయంలో... ఓ పక్క ‘స్వరాజ్యం మా జన్మహక్కు’ అనే నినాదాలు వినిపిస్తుంటే, ఆమె మాత్రం ‘ఓటు హక్కు మా జన్మహక్కు’ అంటూ నినదించారు. భారతీయ మహిళలకు ఓటుహక్కు రావడం వెనుక మిథన్‌లామ్‌ పాత్ర కీలకం...

మిథన్‌ సంపన్న పార్శీ కుటుంబంలో 1898లో పుట్టారు. తండ్రి అర్దేశిర్‌ బెజోంజీ టాటా, తల్లి హేరాబాయ్‌టాటా. ముంబయిలో పుట్టి, పెరిగిన మిథన్‌ ఎల్‌ఫిన్‌స్టోన్‌ కాలేజీలో చదువుకున్నారు. ఎకనామిక్స్‌లో అత్యధిక మార్కులు సంపాదించి, మెడల్‌ని అందుకున్నారు. ఓసారి తల్లితో కలిసి కాశ్మీర్‌ వెళ్లినప్పుడు అప్పటికే మహిళా హక్కుల కోసం పోరాడుతున్న యువరాణి సోఫియాదులీప్‌సింగ్‌ని కలిశారు. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు మిథన్‌ని ఎక్కువగా ఆకర్షించిన విషయం ఆమె ధరించిన బ్యాడ్జ్‌. దానిపై ‘మహిళలకు ఓటు హక్కు’ అని రాసి ఉంది. మాటల్లో ఈ విషయంపై లండన్‌లో త్వరలో ఓ సమావేశం కూడా జరుగుతున్నట్టు చెప్పారామె. అప్పటికి మనకి స్వతంత్రం రాలేదు. దాంతో భారతీయ మహిళలకు ఓటు హక్కు అనే విషయం గురించి అసలు ఎక్కడా చర్చే నడవలేదు. కానీ మిథన్‌, తల్లి హేరాబాయ్‌తో కలిసి లండన్‌ బయలుదేరారు. అక్కడ జరిగిన సమావేశంలో భారతీయ మహిళల తరఫున ఓటు హక్కు కావాలంటూ తమ గొంతు వినిపించారు. అక్కడే ఉండి లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ నుంచి మాస్టర్స్‌ పట్టా అందుకున్నారు. న్యాయవాద విద్యనీ అభ్యసించారు. ఇండియాకు తిరిగొచ్చి మహిళా హక్కుల కోసం ఉద్యమించారు. అలా మద్రాస్‌, ముంబయి ప్రెసిడెన్సీల్లో మహిళలకు ఓటు హక్కు అందింది. ముంబయి హైకోర్టులో మొదటి మహిళా లాయర్‌గా చరిత్ర సృష్టించారు. అప్పటి వరకూ లాయర్లంటే మగవాళ్లే అన్న అభిప్రాయాన్ని తుడిచేశారు. మురికివాడల్లో తిరుగుతూ స్త్రీలు, బాలల హక్కులకోసం కృషిచేశారు. ఆమె అందించిన స్ఫూర్తే నేటికీ మనలో రగులుతూనే ఉందంటే ఆశ్చర్యమేముంది!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్