Sampoornesh Babu: నవ్వులు పంచే ‘ధగడ్‌ సాంబ’

సంపూర్ణేష్‌ బాబు, సోనాక్షి జంటగా ఎన్‌.ఆర్‌.రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ధగడ్‌ సాంబ’. ఆర్‌ఆర్‌ నిర్మాత. జ్యోతి, చలాకి చంటి, మిర్చి మాధవి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో సంపూ

Updated : 08 Jan 2022 07:16 IST

సంపూర్ణేష్‌ బాబు, సోనాక్షి జంటగా ఎన్‌.ఆర్‌.రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ధగడ్‌ సాంబ’. ఆర్‌ఆర్‌ నిర్మాత. జ్యోతి, చలాకి చంటి, మిర్చి మాధవి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో సంపూ, సూఫీ సయ్యద్‌లపై చివరి పాట చిత్రీకరణ తాజాగా పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర బృందం శుక్రవారం ప్రకటించింది. ‘‘వినోదభరిత కథాంశంతో చక్కటి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఇందులో సంపూని సరికొత్తగా చూస్తారు. సోనాక్షి నటన చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తాం’’ అని నిర్మాత తెలిపారు. సంగీతం: డేవిడ్‌.జి, ఛాయాగ్రహణం: ముజీర్‌ మాలిక్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు