sarkaru vaari paata: సర్కారు పాటకు ఒక్క అడుగు

కార్యక్రమాల్ని ప్రారంభిస్తామనీ సినీ వర్గాలు తెలిపాయి. మహేష్‌బాబు, కీర్తి సురేష్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు పరశురామ్‌. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట

Updated : 13 Apr 2022 11:07 IST

కార్యక్రమాల్ని ప్రారంభిస్తామనీ సినీ వర్గాలు తెలిపాయి. మహేష్‌బాబు, కీర్తి సురేష్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు పరశురామ్‌. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట నిర్మాతలు. ఈ యేడాది విడుదలయ్యే వాటిలో అత్యంత ఆసక్తికరమైన కలయికగా, భారీ అంచనాలున్న చిత్రమిది. విడుదల తేదీ విషయంలో పలు రకాలుగా ప్రచారం సాగినా, చిత్రబృందం వీటన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పెట్టింది. మే 12నే ప్రేక్షకుల ముందుకు వస్తోందంటూ మంగళవారం ఓ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. ‘‘మిగిలి ఉన్న ఒక పాటని త్వరలోనే చిత్రీకరిస్తాం. ప్రచార కార్యక్రమాల జోరు పెంచుతాం. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకి చక్కటి స్పందన లభిస్తోంద’’ని సినీ వర్గాలు ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. వెన్నెల కిషోర్‌, సుబ్బరాజు ముఖ్య పాత్రధారులు. ఛాయాగ్రహణం: ఆర్‌.మధి, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, పోరాటాలు: రామ్‌-లక్ష్మణ్‌, సంగీతం: ఎస్‌.ఎస్‌.తమన్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని