Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్‌బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
Bigg Boss Telugu 7: బిగ్‌బాస్ హౌస్ నుంచి మూడో దామిని భట్ల ఎలిమినేట్ అయింది.
హైదరాబాద్: బిగ్‌బాస్ సీజన్-7 నుంచి మూడో వారం గాయని దామిని భట్ల (Damini) ఎలిమినేట్ అయింది. ఈ వారం ప్రియాంక జైన్, శుభశ్రీ, రతికా రోజ్, దామిని, ప్రిన్స్ యావర్, గౌతమ్‌కృష్ణ, అమర్‌దీప్‌లు నామినేషన్స్ ఉండగా, చివరకు దామిని, శుభశ్రీ మిగిలారు. ఈ సందర్భంగా ఇద్దరి ఫొటోలను షిప్‌లపై అంటించి ‘ఏది పేలిపోతే వారు ఎలిమినేట్ అయినట్లు’ అని నాగార్జున ప్రకటించగా, దామిని ఫొటో అంటించిన షిప్ పేలిపోయింది. దీంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. దామిని పేరు ప్రకటించగానే ప్రియాంక జైన్, సందీప్ మాస్టర్ భావోద్వేగానికి గురయ్యారు. ‘ఇదంతా గేమ్ అమ్మా.. ఎమోషన్ అవ్వొద్దు’ అని శివాజీ హితవు పలికాడు. అంతకు ముందు ‘స్కంద’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా యువ కథానాయకుడు రామ్ పోతినేని బిగ్‌బాస్ వేదికపైకి వచ్చి సందడి చేశారు. హౌస్‌మేట్స్‌తో డ్యాన్స్ వేయించారు.
హౌస్ నుంచి బయటకు వచ్చిన దామిని ఇంకొన్ని రోజులు బిగ్‌బాస్‌లో (Bigg Boss Telugu 7) ఉంటానని అనుకున్నానని దామిని చెప్పింది. ‘‘ఎలిమినేషన్ అస్సలు ఊహించలేదు. హౌస్‌లోకి వచ్చి మూడు వారాలే కావడంతో, ఇంట్లో వాళ్లను వదిలేసి వచ్చానన్న ఫీలింగ్ కూడా లేదు. ఇంకా ముందుకు వెళ్తానని అనిపించింది’ అని దామిని చెప్పింది. ఈ సందర్భంగా హౌస్మేట్స్ ఫొటోలు అంటించిన బెలూన్స్‌ను బద్దలు కొట్టి ప్రతి ఒక్కరికీ ఒక సలహా ఇవ్వమని నాగార్జున సూచించారు.
- రతిక: వాదన చేస్తున్నప్పుడు సగం సగం వినకు ముఖ్యమైన పాయింట్లకే జవాబు ఇవ్వు.
- తేజ: ఎవరి మనసు నొప్పించనని తేజ కొన్ని రూల్స్ పెట్టుకున్నాడు. ఈ షోలో అది వర్కవుట్ అవదు. చెప్పాలనుకున్నది ముఖంపైనే చెప్పు.
- ప్రిన్స్ యావర్: ఏం చెప్పినా ముందు అర్థం చేసుకో. తొందరపడొద్దు. తెలుగు అర్థం చేసుకో. తెలియకపోతే హౌస్‌మేట్స్‌ను అడుగు.
- సందీప్: కొంచెం తక్కువ ఆడండి. అందరినీ డామినేట్ చేస్తున్నారు. గతవారం టాస్క్‌లో కొంచెం ఫేవర్ చూపించారు.
- శుభశ్రీ: చాలా ట్రిక్కీ. హౌస్‌లో కొంచెం ఎక్కువ పనిచెయ్. ఏయే పనులు చేయాలో మిగిలిన వాళ్లను అడుగు.
- శోభ: కేవలం ప్రియాంక, అమర్దీప్లతోనే కాదు, అందరితోనూ కలిసి ఉండు. తేజను దూరం పెట్టు. అతను నిన్ను ఆడనివ్వడు.
- శివాజీ: నేను సేఫ్ ఆడానని మీరు అన్నారు. మీరు ఒకరిద్దరికి ఫేవర్‌గా ఉండటం నాకు నచ్చలేదు. (మధ్యలో శివాజీ కలగజేసుకుని, నేను చెప్పింది నిజమో? కాదో? మీ స్నేహితులను అడుగు. ఒకసారి ఇప్పటివరకూ జరిగిన బిగ్‌బాస్ చూడు. నాది తప్పు అయితే, నేను అన్న మాటలు వెనక్కి తీసుకుని, నీకు క్షమాపణ చెబుతా’ అన్నాడు)
- ప్రియాంక: ఇంకా ఇంకా బాగా ఆడు. నాలాగా ఎక్కువ సేపు కిచెన్‌లో ఉండొద్దు.
- గౌతమ్: మంచి స్నేహితుడు. ‘అన్నీ నాకే తెలుస’ని అనుకుంటావు. అది తగ్గించుకో..
- అమర్దీప్: అందరితోనూ ఒకేలా ఉండండి. ముందు నుంచి పరిచయం ఉన్న వాళ్లతో కూడా మీరు చెప్పాలనుకున్నది స్పష్టం చెప్పండి.
- ప్రశాంత్: ఏం చెప్పినా చేస్తాడు. కానీ, గోడమీద బల్లిలా ఉంటాడు. నామినేషన్స్ రోజున మాత్రం పులిలా మారిపోతాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Vishal: మేం అలాంటి పరిస్థితిలో లేం..: జీసీసీపై విశాల్ అసహనం
భారీ వర్షాలతో చెన్నై అతలాకుతమైన నేపథ్యంలో హీరో స్పందించారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్‌పై ఆయన అసహనం వ్యక్తం చేశారు. -
Social Look: నితిన్ - సిద్ధు సరదా మాటలు.. బ్లాక్ అండ్ వైట్‌లో దివి
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు.. -
Thalaivar 170: షూటింగ్లో గాయపడ్డ రితికా సింగ్.. విరామం తీసుకుంటున్నట్లు పోస్ట్
నటి రితికా సింగ్ (Ritika Singh) గాయపడ్డారు. దీంతో ‘తలైవా 170’ నుంచి కొన్నిరోజులు విరామం తీసుకుంటున్నట్లు తెలిపారు. -
Animal Movie: ‘యానిమల్’ మూవీపై రాంగోపాల్‌వర్మ రివ్యూ.. నాలుగున్నర గంటలున్నా తక్కువే!
Animal Movie: రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా సందీప్ వంగా దర్శకత్వంలో రూపొందిన ‘యానిమల్’పై దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన రివ్యూని ఇచ్చారు. -
Allu Aravind: త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను కలుస్తాం: అల్లు అరవింద్
తెలంగాణలో కాంగ్రెస్ విజయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) తెలిపారు. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను కలుస్తామని అన్నారు. -
Vijay Varma: జ్యోతిష్యుడికి నచ్చలేదని సినిమా నుంచి తీసేశారు: విజయ్ వర్మ
నటుడు విజయ్ వర్మ (Vijay Varma) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు తెలిపారు. -
Trisha: నెటిజన్ల విమర్శలు.. ‘యానిమల్’పై పోస్ట్ తొలగించిన త్రిష
నెటిజన్ల నుంచి వస్తోన్న విమర్శలను దృష్టిలో ఉంచుకుని ‘యానిమల్’ (Animal)పై పెట్టిన పోస్ట్‌ను నటి త్రిష (Trisha) తొలగించారు. -
Nani: మణిరత్నం సినిమాలు చూసి చాలా టెక్నిక్స్ నేర్చుకున్నా : నాని
నాని నటించిన తాజా చిత్రం ‘హాయ్ నాన్న’(Hi Nanna). ఈ సినిమా ప్రమోషన్స్‌తో ఆయన బిజీగా ఉన్నారు. -
Allu Aravind: అతడు మా కుటుంబంలో ఎవరికీ పీఆర్వో కాదు: అల్లు అరవింద్
ఇటీవల గోవా వేదికగా జరిగిన ఓ అవార్డుల కార్యక్రమం ప్రస్తుతం చిత్రపరిశ్రమలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. పలువురు కన్నడ నటీనటులు తెలుగు చిత్ర పరిశ్రమను తప్పుబట్టడంపై నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) స్పందించారు. -
Kriti Sanon: ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం.. చట్టపరమైన చర్యలు తీసుకున్న కృతి సనన్
తాను ట్రేడింగ్ మాధ్యమాల గురించి మాట్లాడలేదని నటి కృతి సనన్ (Kriti Sanon) స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు వార్తలపై జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. -
Animal: కన్నీళ్లు పెట్టుకున్న బాబీ దేవోల్.. వీడియో వైరల్
‘యానిమల్’ సినిమాలో విలన్‌గా ప్రేక్షకులను ఆకట్టకున్నారు బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ (Bobby Deol). ఈ సినిమా విజయం సాధించడంతో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. -
Social Look: క్యూట్ ట్రైనర్‌తో మహేశ్ బాబు.. మీనాక్షి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... -
Animal: రణ్‌బీర్‌తో వర్క్.. త్రిప్తి డిమ్రి ఏమన్నారంటే..?
‘యానిమల్’ (Animal)లో రణ్‌బీర్ (Ranbir Kapoor)తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడంపై నటి త్రిప్తి డిమ్రి (Tripti dimri) స్పందించారు. ఆయనతో మరోసారి వర్క్ చేయాలని ఉందన్నారు. -
Nagarjuna: నాగచైతన్యను మెచ్చుకున్న నాగార్జున..!
నాగచైతన్య (Naga Chaitanya) నటించిన ‘దూత’ (Dhootha) సిరీస్‌ను తాజాగా నాగార్జున (Nagarjuna) వీక్షించారు. సిరీస్ తనకెంతో నచ్చిందన్నారు. -
Social Look: ఓవర్ థింకింగ్ సీఈవో జాన్వి.. గాయాలతో కల్యాణి
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు.. -
Aamir Khan: ‘లాల్‌సింగ్ చడ్డా’ ఫ్లాప్.. ఆమిర్‌ఖాన్ ఎంతో బాధపడ్డారు..!
‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha) పరాజయం తర్వాత ఆమిర్‌ఖాన్ (Aamir Khan) ఎంతో బాధపడ్డారని బాలీవుడ్ నటుడు, క్యాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ తెలిపారు. -
Animal: రణ్‌బీర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్.. ‘యానిమల్’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే!
రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన ‘యానిమల్’ (Animal) తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. మంచి కలెక్షన్లతో రణ్ బీర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. -
Silk Smitha: సిల్క్ స్మిత బయోపిక్.. హీరోయిన్గా ఎవరంటే..?
సిల్క్ స్మిత (Silk Smita) జీవితాన్ని ఆధారంగా చేసుకుని నూతన దర్శకుడు జయరామ్ ఓ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఇది విడుదల కానుంది. -
Sathya: హాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికపై సాయి ధరమ్ తేజ్ షార్ట్ ఫిల్మ్
సాయి ధరమ్ తేజ్ షార్ట్ ఫిల్మ్ ‘సత్య’ను (Satya) హాలీవుడ్లో జరగనున్న ఓ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించనున్నారు. -
Trivikram: పుస్తకం ఎందుకు చదవాలంటే.. త్రివిక్రమ్ మాటల్లో..!
దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) తాజాగా ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడారు. పుస్తకం చదవడం ఎంత ఉపయోగమో చెప్పారు. -
Naga Chaitanya: ఆ తర్వాత పట్టించుకోను: పర్సనల్ లైఫ్‌పై నాగచైతన్య కామెంట్స్
పనిపైనే తాను దృష్టి పెట్టినట్లు హీరో నాగచైతన్య తెలిపారు. ఇకపై తన సినిమాలే మాట్లాడతాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/12/2023)
-
Polavaram: పోలవరం ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం నిధులు కోరింది: కేంద్రం
-
Vishal: మేం అలాంటి పరిస్థితిలో లేం..: జీసీసీపై విశాల్ అసహనం
-
Kamal Nath: అరుదైన సన్నివేశం.. సీఎం చౌహాన్‌ను కలిసిన కమల్‌నాథ్
-
Nani: మహేశ్ బాబుతో మల్టీస్టారర్.. నాని ఆన్సర్ ఏంటంటే?
-
Jairam Ramesh: ‘ఆ మూడు బిల్లులు ప్రమాదకరం..! వాటిని వ్యతిరేకిస్తాం’