Sreeleela: క్లిష్టత లేదంటే కారణం ఆ స్పష్టత: శ్రీలీల

తెలుగు తెరపై మెరిసిన అనతి కాలంలోనే స్టార్‌ నాయికగా పేరు తెచ్చేసుకుంది శ్రీలీల. అగ్ర హీరోలు.. యువ కథానాయకులు అని తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ జోరు చూపిస్తోంది.

Updated : 21 Jan 2024 11:42 IST

తెలుగు తెరపై మెరిసిన అనతి కాలంలోనే స్టార్‌ నాయికగా పేరు తెచ్చేసుకుంది శ్రీలీల. అగ్ర హీరోలు.. యువ కథానాయకులు అని తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ జోరు చూపిస్తోంది. అయితే ఓ పాత్ర నుంచి బయటకొచ్చి వెంటనే మరో పాత్రలోకి ప్రవేశించడం ఏమైనా క్లిష్టంగా అనిపిస్తుందా? అంటే తనదైన శైలిలో ఇలా బదులిచ్చింది శ్రీలీల. ‘‘నేనెప్పుడూ స్విచ్చాన్‌.. స్విచ్చాఫ్‌ పర్సన్‌లాగే ఉంటా. అదే నా బలం. దాని వల్లే ఒకేరోజు మూడు సినిమాల్లో మూడు పాత్రలు చేయాల్సి వచ్చినా వెంట వెంటనే ఒక పాత్రలో నుంచి మరో పాత్రలోకి తేలికగా ఒదిగిపోగలుగుతున్నా. చదువు, నటన విషయాల్లోనూ నా ఆలోచనా ధోరణి ఇలాగే ఉంటుంది. సెట్లో ఉన్నంత సేపు నటన తప్ప నాకు మరో ధ్యాస ఉండదు. ఒకసారి సెట్‌ నుంచి బయటకొచ్చానంటే నటిగా నా మైండ్‌ స్విచ్చాఫ్‌ అయిపోతుంది. ఇక పుస్తకం పట్టుకుంటే నేనూ అందరిలాంటి విద్యార్థినైపోతా. ఇలా ఎక్కడ ఏ పని చేయాలో నాకు స్పష్టత ఉంది కాబట్టే ఎప్పుడూ ఏది నాకు క్లిష్టంగా అనిపించదు’’ అని చెప్పుకొచ్చింది శ్రీలీల. ఇక తన డ్యాన్స్‌ విషయంలో ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు ఏమైనా ఒత్తిడిని కలిగిస్తుంటాయా? అని ప్రశ్నిస్తే.. దాన్నెప్పుడూ ఒత్తిడిగా అనుకోనని, బాధ్యతగానే భావిస్తానని బదులిచ్చింది శ్రీలీల.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు