Sreeleela: శ్రీలీల..నీ నుంచి స్ఫూర్తి పొందా: మృణాల్‌ ఠాకూర్‌ పోస్ట్‌

మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur), శ్రీలీల (Sreeleela) మధ్య ఇన్‌స్టా వేదికగా జరిగిన సంభాషణలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. శ్రీలీల నుంచి తాను ప్రేరణ పొందానని మృణాల్‌ అన్నారు.

Published : 15 Dec 2023 02:12 IST

హైదరాబాద్‌: నాని (Nani) - మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) నటించిన ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna). శౌర్యువ్‌ దర్శకత్వం వహించిన ఈసినిమా ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్స్‌తో రాణిస్తోంది. తాజాగా ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు నటి శ్రీలీల (Sreeleela). ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్న ఈ సినిమా తనకెంతో నచ్చిందని అన్నారు.

‘‘హాయ్‌ నాన్న’ ఇదొక ఎమోషనల్‌ కథా చిత్రం. నాని.. ఈ కథతో మీరు ఎప్పటిలాగానే మా మనసుని తాకారు. మృణాల్‌ నటన, ఆమె లుక్స్‌ మా హృదయాన్ని దోచుకున్నాయి. ఇక, బేబీ కియారా అయితే క్యూట్‌గా ఉంది. స్క్రీన్‌పై తనని చూసిన ప్రతి ఒక్కరూ కిడ్నాప్‌ చేసేయాలనుకున్నారు. కంగ్రాట్స్‌ శౌర్యువ్‌. సినిమా అద్భుతంగా తీర్చిదిద్దారు’’ అని శ్రీలీల ట్వీట్‌ చేశారు. దీనిపై మృణాల్‌ స్పందించారు.

Guntur Kaaram: ‘గుంటూరు కారం’ పాటపై విమర్శలు.. కాస్త జాగ్రత్తగా మాట్లాడండి అంటూ రచయిత ఆగ్రహం..!

‘‘థ్యాంక్యూ సో మచ్‌ మై స్వీట్‌ హార్ట్‌. నీకు ఈసినిమా నచ్చినందుకు నేను సంతోషిస్తున్నా. నీ నుంచి నేను ఎంతో స్ఫూర్తి పొందా. ఓ వైపు చదువుకుంటూ మరోవైపు వర్క్‌ చేయడం అంత సులభమైన విషయం కాదు. అందుకు నీ విషయంలో నేనెంతో గర్వపడుతున్నా’’ అని రిప్లై ఇచ్చారు. దీనిపై శ్రీలీల స్పందిస్తూ..  ‘‘మీ మాటలు నాకెంతో విలువైనవి. నాకు ఆనందాన్ని అందించాయి’’ అని అన్నారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

గతేడాది విడుదలైన ‘ధమాకా’, ‘సీతారామం’తో టాలీవుడ్‌లో క్రేజ్‌ సొంతం చేసుకున్నారు నటీమణులు శ్రీలీల (Sreeleela), మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur). ఒకరేమో వరుస సినిమాలు చేస్తుంటే.. మరొకరేమో ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో ప్రేక్షకులకు వినోదం అందిస్తున్నారు. తాజాగా వీరిద్దరి చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడ్డాయి. మృణాల్‌ నటించిన ‘హాయ్‌ నాన్న’ విడుదలైన మరుసటి రోజు శ్రీలీల నటించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ మిశ్రమ స్పందనలకు పరిమితం కాగా, ‘హాయ్‌ నాన్న’ హిట్ అందుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని