Sudheer Babu: బొద్దు బాబు...దుర్గ

ఆరు పలకల దేహంతో ఎప్పుడూ ఫిట్‌గా కనిపించే సుధీర్‌బాబు (Sudheer babu) ఇలా మారిపోయాడేమిటని ఆశ్చర్యపోతున్నారా? ‘మామా మశ్చీంద్ర’ (Maama Mascheendra) కోసం సుధీర్‌ చేసిన మాయ ఇది.

Updated : 02 Mar 2023 06:52 IST

ఆరు పలకల దేహంతో ఎప్పుడూ ఫిట్‌గా కనిపించే సుధీర్‌బాబు (Sudheer babu) ఇలా మారిపోయాడేమిటని ఆశ్చర్యపోతున్నారా? ‘మామా మశ్చీంద్ర’ (Maama Mascheendra) కోసం సుధీర్‌ చేసిన మాయ ఇది. నటుడు, రచయిత హర్షవర్ధన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సుధీర్‌బాబు మూడు కోణాల్లో సాగే పాత్రలో సందడి చేయబోతున్నాడు. ఓ పాత్రలో ఊబకాయంతో కనిపించే యువకుడిగా నటించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు నిర్మిస్తున్న చిత్రమిది. సోనాలి నారంగ్‌, సృష్టి సమర్పకులు. కథానాయకుడు సుధీర్‌బాబు ఈ సినిమాలో దుర్గ, పరశురామ్‌, డీజే అనే మూడు పాత్రల్లో కనిపిస్తారు. బుధవారం దుర్గ పాత్ర లుక్‌ని విడుదల చేశారు. విలక్షణంగా కనిపించే ఈ పాత్ర కోసం సుధీర్‌ మారిన విధానం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నెల 4న పరశురామ్‌ లుక్‌నీ, 7న డీజే లుక్‌నీ విడుదల చేయనున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని