Rajinikanth: ‘ఇదే రజనీకాంత్ చివరి సినిమా..!’ వైరలవుతోన్న డైరెక్టర్ కామెంట్స్
రజనీకాంత్ (Rajinikanth) సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారని ప్రముఖ దర్శకుడు మిస్కిన్ (Miskin) అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరలవుతున్నాయి.
హైదరాబాద్: సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) తనదైన మేనరిజంతో అభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానం దక్కించుకొన్నాడు. ప్రతి సినిమాలోనూ నటనతోనే కాదు ఏదో ఒక ప్రత్యేకమైన స్టైల్, పంచ్ డైలాగులతో అలరిస్తుంటాడీ స్టార్ హీరో. ఏడు పదుల వయసులోనూ కుర్ర హీరోలతో పోటీపడుతూ యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. 170కి పైగా సినిమాల్లో నటించిన రజనీ మరికొన్ని రోజుల్లో చిత్రపరిశ్రమకు గుడ్‌బై చెప్పనున్నారట. ఇప్పుడీ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియా వేదికగా దీనిపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.
సూపర్ స్టార్ రజనీకాంత్‌పై ప్రముఖ తమిళ దర్శకుడు మిస్కిన్ (Miskin) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. లోకేశ్ కనకరాజ్ (Lokesh Kangaraj) దర్శకత్వంలో రజనీ సినిమా చేస్తున్నట్లు మిస్కిన్ వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..‘‘లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో నటించాలని రజనీ ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమా గురించి ఆయనే స్వయంగా లోకేశ్‌ను అడిగారు. బహుశా ఇదే రజనీకాంత్‌కు చివరి సినిమా కావచ్చు’’ అని అన్నారు. ప్రస్తుతం మిస్కిన్ చేసిన ఈ వ్యాఖ్యలు సినీరంగంలో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘తలైవా ఇలాంటి నిర్ణయం తీసుకోరు’ అని ఒకరంటే.. ‘రజనీకాంత్ పై ఇలాంటి ప్రచారాలు ఆపండి’ అని మరో అభిమాని విజ్ఞప్తి చేశారు.
అయితే రజనీ సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారనే వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. ‘బాబా’ సినిమా వచ్చిన సమయంలోనూ ఆయన ఇక తెరపై కనిపించరనే వార్తలు జోరుగా ప్రచారమయ్యాయి. దాని తర్వాత మూడేళ్లు విరామం తీసుకున్న ఆయన.. 2005లో ‘చంద్రముఖి’తో తన మార్క్ చూపించి సూపర్ హిట్ అందుకున్నాడు. నాటి నుంచి వరుస చిత్రాలతో తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా మిస్కిన్ వ్యాఖ్యలతో మరోసారి రజనీ చివరి సినిమా గురించి చర్చలు మొదలయ్యాయి.
ఇక ఈ సూపర్ స్టార్ త్వరలోనే ‘జైలర్’(Jailer)తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. దీని తర్వాత ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో ‘లాల్ సలాం’ (Lal Salaam)లో నటిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఇక దీని తర్వాత లోకేశ్ కనకరాజ్ సినిమాలో రజనీకాంత్ నటించే అవకాశముంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Rana Daggubati: అప్పుడు పెద్ద సవాలు ఎదుర్కొన్నా.. అందుకే నటుణ్ని అయ్యా: రానా
-
India News
Pankaja Munde: నేను భాజపా వ్యక్తినే.. కానీ, పార్టీ నాది కాదు!
-
India News
Cheetah: చీతాల మృతి.. పూర్తి బాధ్యత మాదే: కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్
-
Movies News
Bharathiraja: హీరోగా విజయ్‌ని పరిచయం చేయమంటే.. భారతిరాజా తిరస్కరించారు
-
Politics News
Nara Lokesh: ప్రొద్దుటూరులో లోకేశ్‌పై కోడిగుడ్డు విసిరిన ఆకతాయి.. దేహశుద్ధి చేసిన కార్యకర్తలు
-
India News
Delhi Highcourt: మద్యం పాలసీ మంచిదైతే.. ఎందుకు వెనక్కి తీసుకున్నట్లు?