Sushmita Sen: లలిత్‌ మోదీతో ప్రేమాయణం.. కామెంట్స్‌పై తొలిసారి స్పందించిన సుస్మిత

నటి సుస్మితాసేన్‌ (Sushmita Sen) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాను ఎదుర్కొన్న కామెంట్స్‌పై మాట్లాడారు.

Published : 05 Aug 2023 17:53 IST

ముంబయి: తన సరికొత్త ప్రాజెక్ట్‌ ‘తాళి’ (Taali) ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌ (Sushmita Sen). ‘తాళి’ ప్రాజెక్ట్‌తోపాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలపై ఆమె మాట్లాడారు. ముఖ్యంగా, లలితా మోదీ (Lalit Modi)తో తాను రిలేషన్‌లో ఉన్నానంటూ వార్తలు వచ్చిన నాటి రోజులపై ఆమె స్పందించారు. ఆ సమయంలో పలువురు నెటిజన్లు తనని ‘గోల్డ్ డిగ్గర్‌’ అని విమర్శించారన్నారు. అయితే, ఇది తన జీవితమని.. బయట వ్యక్తులకు అనవసరమని చెప్పారు.

‘‘ఆ విమర్శలు నా వరకూ రావడం మంచిదే. అలాగే, ‘గోల్డ్‌ డిగ్గర్‌’ అంటే నిజమైన అర్థమేమిటో తెలుసుకోగలను. మిమ్మల్ని ప్రభావితం చేసేవిధంగా విమర్శలకు అనుమతిస్తే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తాం. బాధపడతాం. నేను అలా చేయలేదు. అలాంటి వాటిని నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే, ఇది నా జీవితం. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు అందరితో చెప్పాల్సిన అవసరం లేదు’’ అని ఆమె బదులిచ్చారు. అంతేకాకుండా, ప్రస్తుతం తాను ఎవరితోనూ రిలేషన్‌లో లేనని.. సింగిల్‌గానే ఉన్నానన్నారు. ఆన్‌లైన్‌ నెగెటివిటీపై మాట్లాడుతూ.. ‘‘నాకు మాట్లాడాలనిపించిన సమయంలో తప్పకుండా స్పందిస్తా. లేకపోతే లేదు’’ అని బదులిచ్చారు.

తెలుగు ప్రేక్షకులను ఉద్దేశిస్తూ మృణాల్‌ ఠాకూర్‌ ఎమోషనల్‌ పోస్ట్‌.. కారణం ఏమిటంటే?

అనంతరం ఆమె ‘తాళి’ ఫస్ట్‌లుక్‌కు వచ్చిన విమర్శలపై మాట్లాడుతూ..‘‘సామాజిక కార్యకర్త, ట్రాన్స్‌జెండర్‌ శ్రీగౌరి సావంత్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘తాళి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఈ సినిమాలో నేను ప్రధాన పాత్ర పోషిస్తున్నా. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసినప్పుడు పేరు లేని పలువురు నెటిజన్లు నన్ను కామెంట్‌ చేశారు. అసభ్యంగా మాట్లాడారు. వాటిని చూసి షాకయ్యాను. వీళ్లు ఎలా ఇలాంటి కామెంట్స్‌ చేయగలుగుతున్నారు? అనిపించింది’’ అని ఆమె తెలిపారు.

సుస్మితా సేన్‌తో తాను డేటింగ్‌లో ఉన్నానంటూ భారత మెగా టీ20 క్రికెట్‌ లీగ్‌ మాజీ ఛైర్మన్ లలిత్‌ మోదీ(Lalit Modi) గతేడాది ఓ ట్వీట్‌ చేశారు. త్వరలోనే వివాహం చేసుకుంటున్నట్టు ఆయన ట్వీట్‌ చేశారు. అప్పట్లో ఆయన ట్వీట్‌ అంతటా వైరల్‌గా మారింది. దీనిని చూసిన పలువురు నెటిజన్లు సుస్మితను విమర్శించారు. డబ్బు కోసమే ఆమె లలిత్‌ను ప్రేమిస్తుందన్నారు. మరోవైపు, వీరి ప్రేమాయణం వార్తలు వైరల్‌గా మారిన కొన్నిరోజులకే లలిత్‌ తన ట్వీట్‌ను తొలగించేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని