Poonam Kaur: ప్రకాశ్‌రాజ్‌ గెలవాలి.. నేను ఎదుర్కొన్న సమస్యల్ని బయటపెడతా: పూనమ్‌

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ గెలవాలని తాను కోరుకుంటున్నట్టు  నటి పూనమ్‌ కౌర్‌ తెలిపారు.

Published : 02 Oct 2021 01:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ గెలవాలని తాను కోరుకుంటున్నట్టు  నటి పూనమ్‌ కౌర్‌ తెలిపారు. అప్పుడే ఇంతకాలం తాను ఎదుర్కొన్న సమస్యల్ని చెప్పగలిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ మేరకు ప్రకాశ్‌రాజ్‌తో కలిసి దిగిన ఫొటోని పంచుకుంటూ ఓ ట్వీట్‌ పెట్టారు. ‘‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ సర్‌ గెలవాలని కోరుకుంటున్నా. ఆయన విజయం సాధిస్తే ఇంతకాలం నేను ఎదుర్కొన్న సమస్యల్ని బయటపెడతా. ఆయన చిల్లర రాజకీయాలు చేయరు’ అని పేర్కొన్నారు. ప్రకాశ్‌రాజ్‌ ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబరు 10న ఈ ఎన్నికలు జరగనున్నాయి. ‘శౌర్యం’, ‘గణేష్‌’, ‘గగనం’, ‘శ్రీనివాస కల్యాణం’ సహా పలు చిత్రాల్లో పూనమ్‌ కౌర్‌ నటించి మెప్పించారు. ప్రకాశ్‌రాజ్‌-పూనమ్‌ కలిసి ‘గగనం’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని