Actress Tulasi: మా నాన్న మోసం చేశారు.. అన్నయ్యే తండ్రయ్యాడు: నటి తులసి

తన తండ్రి తమని మోసం చేసి వెళ్లిపోయారని, తర్వాత తన సోదరుడే నాన్నగా మారాడని నటి తులసి భావోద్వేగానికి గురయ్యారు.

Published : 01 Dec 2021 17:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన తండ్రి తమని మోసం చేసి వెళ్లిపోయారని, తర్వాత తన సోదరుడే నాన్నగా మారాడని నటి తులసి భావోద్వేగానికి గురయ్యారు. ‘ఈటీవీ’లో ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. స్కిట్‌లో భాగంగా కొందరు కంటెస్టెంట్లు అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల అనుబంధాన్ని చూపించారు. బుల్లెట్‌ భాస్కర్‌, మహేశ్‌ విట్టా తదితరులు నవ్విస్తూనే తమ సోదరీమణులపై ఉన్న ప్రేమను తెలియజేశారు. ఈ క్రమంలో తన అన్నయ్యను గుర్తుచేసుకున్న తులసి కన్నీటి పర్యంతమయ్యారు. ‘మా నాన్న మమ్మల్ని చిన్నప్పుడే మోసం వెళ్లిపోయాడు. ఆ తర్వాత మా అన్నయ్యే మాకు నాన్నలా మారాడు. ఈరోజు నేనీ స్థాయిలో ఉన్నానంటే కారణం మా అన్నయ్యే. భాస్కర్‌ అన్నయ్యా.. లవ్‌ యు. యు ఆర్‌ ది బెస్ట్‌’ అంటూ తన సోదరుడిపై ఉన్న ప్రేమను చాటారు.

తులసి ‘భార్య’ చిత్రంతో 1967లో బాలనటిగా తెరంగ్రేటం చేశారు. ‘జీవన తరంగాలు’, ‘శంకరాభరణం’, ‘న్యాయం కావాలి’, ‘శుభలేఖ’, ‘మంత్రిగారి వియ్యంకుడు’, ‘త్రిశూలం’, ‘అనుబంధం’ తదితర చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సుమారు 300 చిత్రాల్లో నటించారు. 90ల్లో కథానాయకుల సోదరి పాత్రలో ఒదిగిపోయిన తులసి ఈతరం నాయకానాయికలకు తల్లిగా కనిపించి తనదైన ముద్ర వేస్తున్నారు.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని