Chiranjeevi: ‘రంగమార్తాండ’కు మెగాస్టార్‌ వాయిస్‌

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగమార్తాండ’. మరాఠీలో సూపర్‌హిట్‌ విజయాన్ని సొంతం చేసుకున్న ‘నటసామ్రాట్‌’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. నాటకాన్ని ప్రాణంగా భావించి....

Published : 26 Oct 2021 13:51 IST

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగమార్తాండ’. మరాఠీలో సూపర్‌హిట్‌ విజయాన్ని సొంతం చేసుకున్న ‘నటసామ్రాట్‌’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. నాటకాన్ని ప్రాణంగా భావించి.. దాన్నే ఆధారంగా చేసుకుని జీవించే కళాకారులు, వారి కష్టాలను తెలియజేసేలా ఈ సినిమా సిద్ధమవుతోంది. ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలకపాత్రల్లో కనిపించనున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి మెగాస్టార్‌ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ అందించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మంగళవారం మధ్యాహ్నం కృష్ణవంశీ ఓ ట్వీట్‌ చేశారు. చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు. ఆదర్శ్‌ బాలకృష్ణ, అనసూయ, రాహుల్‌ సిప్లిగంజ్‌, శివాత్మిక రాజశేఖర్‌ తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని