Dulquer Salmaan: లైఫ్‌ పార్టనర్‌ని అలా సెలెక్ట్‌ చేసుకోవడం కరెక్ట్‌ కాదు!

దుల్కర్‌ సల్మాన్‌, కల్యాణి ప్రియదర్శన్‌ జంటగా నటించిన నటించిన మలయాళీ చిత్రం ‘వరునె అవశ్యముంద్‌’.

Updated : 22 Sep 2021 22:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దుల్కర్‌ సల్మాన్‌, కల్యాణి ప్రియదర్శన్‌ జంటగా నటించిన మలయాళీ చిత్రం ‘వరునె అవశ్యముంద్‌’. అనూప్‌ సత్యన్‌ దర్శకుడు. గతేడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా మలయాళ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ‘పరిణయం’ పేరుతో తెలుగు ప్రేక్షుకుల్ని అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ వేదికగా ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ విడుదలైంది. ‘మీరు మీ ఫ్రెండ్‌లానే పెళ్లి చేసుకుంటారా’ అనే ప్రశ్నకి.. ‘నేను డీసెంట్‌.. అలా చేయను’ అంటూ కథానాయిక ఇచ్చే సమాధానంతో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. కామెడీ, భావోద్వేగ సన్నివేశాలతో అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ప్రముఖ నటులు సురేశ్‌ గోపి, శోభన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ‘ఏవో కొన్ని పారామీటర్స్‌ ఆధారంగా లైఫ్‌ పార్టనర్‌ని సెలెక్ట్‌ చేసుకోవడం కరెక్ట్‌ కాదు’ అని శోభన చెప్పిన డైలాగ్‌ మెప్పిస్తోంది. మరి దుల్కర్‌, కల్యాణి పరిణయం ఎలా జరిగింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని