Dulquer Salmaan: లైఫ్ పార్టనర్‌ని అలా సెలెక్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదు!
దుల్కర్ సల్మాన్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన నటించిన మలయాళీ చిత్రం ‘వరునె అవశ్యముంద్’.
ఇంటర్నెట్ డెస్క్: దుల్కర్ సల్మాన్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన మలయాళీ చిత్రం ‘వరునె అవశ్యముంద్’. అనూప్ సత్యన్ దర్శకుడు. గతేడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా మలయాళ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ‘పరిణయం’ పేరుతో తెలుగు ప్రేక్షుకుల్ని అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ వేదికగా ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ విడుదలైంది. ‘మీరు మీ ఫ్రెండ్‌లానే పెళ్లి చేసుకుంటారా’ అనే ప్రశ్నకి.. ‘నేను డీసెంట్.. అలా చేయను’ అంటూ కథానాయిక ఇచ్చే సమాధానంతో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. కామెడీ, భావోద్వేగ సన్నివేశాలతో అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ప్రముఖ నటులు సురేశ్ గోపి, శోభన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ‘ఏవో కొన్ని పారామీటర్స్ ఆధారంగా లైఫ్ పార్టనర్‌ని సెలెక్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదు’ అని శోభన చెప్పిన డైలాగ్ మెప్పిస్తోంది. మరి దుల్కర్, కల్యాణి పరిణయం ఎలా జరిగింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కథ కలిపింది..ఇద్దరినీ!
హిట్టు మాట వినిపించి... స్టార్ ఇమేజ్ దక్కించుకున్నారంటే చాలు.. ఇక ఆ తర్వాత సదరు నాయికల ప్రయాణమంతా అందుకు తగ్గట్లుగా సాగాల్సిందే. -
కల్కి.. పాట వచ్చేస్తోంది
‘కల్కి 2898ఎ.డి’తో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు ప్రభాస్. -
‘నా ఉచ్ఛ్వాసం కవనం’..
తెలుగు సినిమా పాటకు కావ్య గౌరవాన్ని తీసుకువచ్చి, సరికొత్త పోకడ సృష్టించిన గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. -
సిద్ధార్థ్.. కృతి.. ఓ ప్రేమకథ?
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ చిత్రంలో ఎయిర్‌హోస్టెస్‌గా కనిపించి సినీప్రియుల మనసు దోచుకుంది బాలీవుడ్ నాయిక కృతి సనన్. -
సరికొత్త రొమాంటిక్ లవ్‌స్టోరీ
వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘సిల్క్ శారీ’. -
ఛోటా భీమ్ సూపర్ పవర్
‘ధైర్య సాహసాలతో తన ప్రాణాలు పణంగా పెట్టి ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ఒకడుంటాడు. -
పెట్స్‌పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
‘హరోం హర’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్నారు సుధీర్ బాబు. ప్రస్తుతం ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు.