Social Look: జ్ఞాపకంలేని విజయ్‌ దేవరకొండ ఫొటో.. హన్సిక బర్త్‌డే సర్‌ప్రైజ్‌

తన ఫొటోని అభిమానులతో పంచుకున్నాడు యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ. ‘ఇది ఎక్కడ దిగానో, ఎప్పుడు దిగానో, ఎందుకు దిగానో నిజంగా నాకు గుర్తులేదు’ అని రాసుకొచ్చారు.

Published : 10 Aug 2021 01:42 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన ఫొటోని అభిమానులతో పంచుకున్నాడు యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ. ‘ఇది ఎక్కడ దిగానో, ఎప్పుడు దిగానో, ఎందుకు దిగానో నిజంగా నాకు గుర్తులేదు’ అని రాసుకొచ్చారు. 

* ‘ఉనికి’ చిత్రంలో సుబ్బలక్ష్మిగా కనిపించనుంది నటి చిత్ర శుక్ల. ఆ పాత్రకి సంబంధించిన ఫొటోల్ని ఇన్‌స్టాలో షేర్‌ చేసింది.

* ‘ఆనందంగా ఉండండి.. జాగ్రత్తగా ఉండండి’ అని చెబుతోంది నాయిక సదా.

* దర్శకుడు సందీప్‌ రాజ్‌తో దిగిన ఫొటోని షేర్‌ చేశాడు నటుడు సుహాస్‌. ఆ ఫొటోకి సరిపోయే వ్యాఖ్యని జోడించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

* తన కురుల్ని చూపిస్తూ ‘దీనికి క్యాప్షన్‌ ఇవ్వగలరా’ అని అంటోంది యువ నటి దక్ష నగర్కర్‌.

* నటి హన్సిక పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా తన స్నేహితులు చేసిన డెకరేషన్‌ చూసి ఆశ్చర్యానికి గురైంది హన్సిక. 




























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని