Published : 08/11/2021 12:59 IST

Akhanda: ‘అఖండ’ టైటిల్‌ సాంగ్‌ వచ్చేసింది..!

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అఖండ’. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం ఈ సినిమా నుంచి ‘అఖండ’ టైటిల్‌ సాంగ్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ‘కం కం కంగుమంది శంఖం’ అంటూ సాగే ఈ పాటను ప్రముఖ గాయకుడు శంకర్‌ మహదేవన్‌.. ఆయన ఇద్దరు కుమారులు సిద్దార్థ్‌, శివమ్‌ ఆలపించారు. తమన్‌ స్వరాలు అందించారు. మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలయ్య పవర్‌ఫుల్‌ లుక్‌తోపాటు అఘోరాగానూ కనిపించనున్నారు. బాలయ్యకు జోడీగా నటి ప్రగ్యాజైస్వాల్‌ సందడి చేయనున్నారు.  శ్రీకాంత్‌ విలన్‌గా కనిపించనున్నారు. ద్వారక క్రియేషన్స్ పతాకంపై ఈసినిమా నిర్మితమవుతోంది. బోయపాటి-బాలయ్య కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్‌ చిత్రమిది.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని