Trisha: టొవినో సరసన త్రిష?

‘మిన్నల్‌ మురళి’, ‘2018’ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు మలయాళ కథానాయకుడు టొవినో థామస్‌.

Updated : 08 Jul 2023 14:09 IST

‘మిన్నల్‌ మురళి’, ‘2018’ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు మలయాళ కథానాయకుడు టొవినో థామస్‌. ‘ఫోరెన్సిక్‌’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకులు అఖిల్‌ పాల్‌, అనాజ్‌ ఖాన్‌లు మరోసారి కలిసి పనిచేయబోతున్నారు. వీళ్లిద్దరూ తెరకెక్కించనున్న చిత్రం ‘ఐడెంటిటీ’. ఈ చిత్రంలో హీరోగా టొవినో నటించనున్నారు. ఇందులో నాయికగా త్రిష (Trisha) నటించనున్నట్లు తెలుస్తోంది. ‘టొవినో. త్రిష తొలిసారి కలిసి నటించనున్నారు. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రాలతో పాన్‌ ఇండియా స్థాయిలో మంచి విజయం అందుకున్న త్రిష ఈ కొత్త సినిమాలో నటించడం ఎంతో కలిసొచ్చే అంశం’’అని చిత్రవర్గాలు చెప్పినట్లు సమాచారం. త్రిష ప్రస్తుతం విజయ్‌ సరసన లియోతో పాటు మరో రెండు మూడు చిత్రాల్లో నటిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని