Tulasivanam: నేడే ఈటీవీ విన్‌లో ‘తులసీవనం’

అక్షయ్‌ లగుసాని, వెంకటేశ్‌ కాకమాను, ఐశ్వర్య, విష్ణు ప్రధాన పాత్రల్లో అనిల్‌ రెడ్డి తెరకెక్కించిన రొమాంటిక్‌ కామెడీ సిరీస్‌ ‘తులసీవనం’. దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ సమర్పిస్తున్నారు.

Updated : 21 Mar 2024 11:03 IST

క్షయ్‌ లగుసాని, వెంకటేశ్‌ కాకమాను, ఐశ్వర్య, విష్ణు ప్రధాన పాత్రల్లో అనిల్‌ రెడ్డి తెరకెక్కించిన రొమాంటిక్‌ కామెడీ సిరీస్‌ ‘తులసీవనం’. దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ సమర్పిస్తున్నారు. వినోదాత్మకంగా సాగే ఈ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో గురువారం నుంచి ప్రసారం కానున్నట్లు సిరీస్‌ బృందం తెలిపింది. కుటుంబ విషయాలు, క్రికెట్‌లో రాణించాలనే సాహసోపేతమైన కలల మధ్య నలిగిపోతున్న తులసి అనే యువకుడి జీవితాన్ని ఇందులో చూపించనున్నారు. మరి తులసి తన జీవితంలో విరాట్‌ కోహ్లిగా ఆవిర్భవిస్తాడా, లేదా ఉన్న జీవితంతో సరిపెట్టుకుంటడా అనేది తెలియాలంటే ఈ సిరీస్‌ చూడాల్సిందే. ఆరు ఎపిసోడ్స్‌తో, అందరి కథలా అనిపించేలా, అలరించేందుకు సిద్ధంగా ఉందీ ప్రాజెక్టు అని అంటున్నాయి సన్నిహిత వర్గాలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు