ఆమె బయోపిక్‌లో నటించాలనుంది: వాణీ కపూర్‌

ప్రతి నటీనటులకు కెరీర్‌ పరంగా వారికంటూ కొన్ని ఆశలుంటాయి. పౌరాణిక పాత్ర చేయాలి.. విలన్‌ ఛాయలున్న పాత్రలు చేయాలి,  ఓ బయోపిక్‌లో నటించాలని కోరుకుంటారు. అలాగే బాలీవుడ్‌ నటి వాణి కపూర్‌కి కూడా ఒకరి బయోపిక్‌లో

Published : 07 Aug 2020 03:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటీనటులకు కెరీర్‌ పరంగా వారికంటూ కొన్ని ఆశలుంటాయి. పౌరాణిక పాత్ర చేయాలి.. విలన్‌ ఛాయలున్న పాత్రలు చేయాలి.. బయోపిక్స్‌లో నటించాలని కోరుకుంటారు. అలాగే బాలీవుడ్‌ నటి వాణీ కపూర్‌కి కూడా ఒకరి బయోపిక్‌లో నటించాలనే కోరిక ఉందట.

తొలి సినిమా ‘శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌’తో వాణీ కపూర్‌ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకుంది. బాలీవుడ్‌లో మూడు, కోలీవుడ్‌లో ఒకటి మొత్తం కలిపి చేసింది నాలుగు సినిమాలే అయినా సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు చిత్రాలున్నాయి. అయితే దివంగత వ్యోమగామి కల్పనా చావ్లా బయోపిక్‌లో నటించాలని ఉందంటూ తాజాగా ఆమె తన కోరికను బయటపెట్టింది.

‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు, వ్యోమగామి కావాలనుకునే వారికి కల్పనా చావ్లా ఒక రోల్‌ మోడల్‌. ఆమె ఒక స్ఫూర్తిమంతమైన మహిళ. ఆమె జీవితాన్ని కచ్చితంగా చెప్పుకొవాల్సిన అవసరముంది. అందుకే వెండితెరపై ఆమె బయోపిక్‌లో నటించాలని చాలా ఆశపడుతున్నా. ఆమె బయోపిక్‌లో నటించగలిగితే నేను దానిని గౌరవంగా భావిస్తా’’ అని వాణీ కపూర్‌ చెప్పుకొచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని