Vijay: ఏప్రిల్‌ తొలి వారంలో?

తమిళ కథా నాయకుడు విజయ్‌, దర్శకుడు వంశీ పైడిపల్లి కలయికలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న

Updated : 12 Mar 2022 08:51 IST

తమిళ కథా నాయకుడు విజయ్‌, దర్శకుడు వంశీ పైడిపల్లి కలయికలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ సినిమాని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుంది. రెగ్యులర్‌ చిత్రీకరణ ఏప్రిల్‌ తొలి వారంలో ప్రారంభం కానుందని సమాచారం. ఈ చిత్రాన్ని దాదాపుగా చెన్నైలోనే చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. కొన్ని కీలక భాగాలను హైదరాబాద్‌తో పాటు విదేశాల్లో ప్లాన్‌ చేసినట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా రష్మిక కనిపించనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని