Vimala Raman: భిన్న అనుభూతిని పంచే... ‘అశ్విన్స్‌’

వసంత్‌ రవి కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘అశ్విన్స్‌’. విమలా రామన్‌ ముఖ్యపాత్ర పోషించారు. తరుణ్‌ తేజ దర్శకుడు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాత. హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

Updated : 23 Jun 2023 07:27 IST

సంత్‌ రవి కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘అశ్విన్స్‌’. విమలా రామన్‌ ముఖ్యపాత్ర పోషించారు. తరుణ్‌ తేజ దర్శకుడు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాత. హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం గురువారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించింది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘లాక్‌డౌన్‌ సమయంలో ఓ షార్ట్‌ ఫిలిం చేశా. అది చూసిన చిత్ర సమర్పకుడు బాపినీడు ఫోన్‌ చేసి, అదే కాన్సెప్ట్‌ ఆధారంగా సినిమా చేద్దాం అన్నారు. హారర్‌ జోనర్‌లో ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పంచేలా ఈ సినిమా చేశాం. వసంత్‌ రవి, విమలారామన్‌ పాత్రలు గొప్పగా ఉంటాయి’’ అన్నారు. విమలారామన్‌ మాట్లాడుతూ ‘‘తరుణ్‌ కల ఈ సినిమా. కొత్తగా ఏదో చేయాలనే తపనతోనే ఈ సినిమాని తెరకెక్కించాడ’’న్నారు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ప్రేక్షకులకు భిన్నమైన అనుభవాన్నిచ్చేలా ఈ సినిమా చేశారు’’ అన్నారు. ఇప్పటి తరానికి అవసరమైన సందేశం ఈ సినిమాతో చెప్పామన్నారు వసంత్‌ రవి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని