Naga Chaitanya: మరోసారి థ్రిల్లర్‌ కథలో!

నాగచైతన్య థ్రిల్లర్‌ కథలతో ఎంతగా ప్రభావం చూపిస్తారో ఇటీవల విడుదలైన ‘దూత’ సిరీస్‌ చాటి చెప్పింది. అన్నీ కుదిరితే అలా వెండితెరపై ఆయన పక్కా థ్రిల్లర్‌ కథతో సందడి చేసే అవకాశాలున్నాయి

Updated : 27 Mar 2024 11:37 IST

నాగచైతన్య థ్రిల్లర్‌ కథలతో ఎంతగా ప్రభావం చూపిస్తారో ఇటీవల విడుదలైన ‘దూత’ సిరీస్‌ చాటి చెప్పింది. అన్నీ కుదిరితే అలా వెండితెరపై ఆయన పక్కా థ్రిల్లర్‌ కథతో సందడి చేసే అవకాశాలున్నాయి. నాగచైతన్య కథానాయకుడిగా... కార్తీక్‌ దండు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ‘విరూపాక్ష’తో విజయాన్ని అందుకున్న దర్శకుడు ఆయన. ప్రస్తుతం నాగచైతన్య కోసం స్క్రిప్ట్‌ సిద్ధం చేస్తున్నారు. చైతూకి కథ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పనులు చకచకా సాగుతున్నట్టు సమాచారం. ఈ సినిమాని కూడా ‘విరూపాక్ష’ తరహాలోనే ఓ విభిన్నమైన థ్రిల్లర్‌ కథతో తెరకెక్కించనున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమాపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్‌’ చిత్రంతో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన వెంటనే కొత్త చిత్రం కోసం రంగంలోకి దిగనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని