Vishal: విశాల్‌ సినిమా షూటింగ్‌లో ప్రమాదం

విశాల్‌ (Vishal) కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘మార్క్‌ ఆంటోని’ సినిమా సెట్లో ప్రమాదం జరిగింది. చిత్రీకరణ జరుగుతున్న సమయంలో విశాల్‌ సెట్లోనే ఉన్నారు.

Updated : 23 Feb 2023 07:05 IST

విశాల్‌ (Vishal) కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘మార్క్‌ ఆంటోని’ (mark antony) సినిమా సెట్లో ప్రమాదం జరిగింది. చిత్రీకరణ జరుగుతున్న సమయంలో విశాల్‌ సెట్లోనే ఉన్నారు. షూటింగ్‌ కోసం ఉపయోగించిన ఓ భారీ ట్రక్కు అదుపుతప్పి జూనియర్‌ ఆర్టిస్టులు నిల్చొని ఉన్న చోటుకి వేగంగా దూసుకొచ్చింది. కానీ వెంటనే వారు అప్రమత్తం కావడంతో సురక్షితంగా బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్‌ సామాజిక మాధ్యమాలలో పోస్ట్‌ చేశారు. ‘విశాల్‌ కొన్ని సెకన్లలోనే ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. అందరూ సురక్షితంగా ఉన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగింది. త్వరలో షూటింగ్‌ పునఃప్రారంభమవుతోంద’ని ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని