Vishwak sen: అఘోరా శంకర్‌!

విష్వక్‌సేన్‌ కథానాయకుడిగా విద్యాధర్‌ కాగిత దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గామి’. వి సెల్యులాయిడ్‌ పతాకంపై కార్తీక్‌ శబరీష్‌ నిర్మించారు. చాందిని చౌదరి కథానాయిక.

Updated : 29 Jan 2024 11:24 IST

విష్వక్‌సేన్‌ కథానాయకుడిగా విద్యాధర్‌ కాగిత దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గామి’. వి సెల్యులాయిడ్‌ పతాకంపై కార్తీక్‌ శబరీష్‌ నిర్మించారు. చాందిని చౌదరి కథానాయిక. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను హైదరాబాద్‌ కామిక్‌కాన్‌లో ఆదివారం విడుదల చేశారు. అందులో విష్వక్‌ అఘోరా గెటప్‌లో కనిపించారు. చుట్టూ చాలామంది అఘోరాలు ఆయన్ని తాకేందుకు ప్రయత్నిస్తుండటం.. ‘‘అతని అతిపెద్ద భయం మానవ స్పర్శ’’ అంటూ పోస్టర్‌పై ఉన్న వ్యాఖ్య ఆసక్తి రేకెత్తించేలా ఉంది. ‘‘ఇదొక భిన్నమైన అడ్వెంచర్‌ డ్రామా. విష్వక్‌ దీంట్లో శంకర్‌ అనే అఘోరాగా కనిపిస్తారు. తనకొక సమస్య ఉంటుంది. మానవ స్పర్శను తట్టుకోలేడు. ఈ చిత్రంలో అఘోరా సెటప్‌తో పాటు మరో రెండు భిన్నమైన గెటప్‌లు ఉంటాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్రవర్గాలు తెలిపాయి. నరేశ్‌ కుమారన్‌ సంగీతమందిస్తున్నారు. విశ్వనాథ్‌ రెడ్డి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని