Bathukamma 2023: సింగపూర్‌లో బతుకమ్మ సంబురాలకు ఏర్పాట్లు పూర్తి

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండగను సింగపూర్ తెలుగు సమాజం(STS) ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.

Updated : 03 Jan 2024 15:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండగను ఈ ఏడాది ‘సింగపూర్ తెలుగు సమాజం’ (STS) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నామని అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 21వ తేదీన సింగపూర్‌లోని టాంపనిస్ సెంట్రల్ పార్క్ వద్ద సంబురాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. సంబురాల్లో భాగంగా గాయని ‘వరం‘ ప్రత్యక్ష గానం ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు. వారాంతం కాబట్టి కార్యక్రమానికి సింగపూర్‌లోని తెలుగువారంతా హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమ నిర్వాహకులు కురిచేటి స్వాతి మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొనే వారి కోసం భోజన ఏర్పాట్లు చేశామని తెలిపారు. తెలుగు మహిళలందరూ పెద్ద ఎత్తున తరలిరానున్నారని అన్నారు. మొదటి 3 ఆకర్షణీయ బతుకమ్మలకు ప్రత్యేక బహుమతులు, ఒక లక్కీ విజేతకు 5 గ్రాముల బంగారం బహుమతిగా అందజేస్తామని గౌరవ కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ తెలిపారు. సంబురాలకు హాజరయ్యే వారి కోసం సింగపూర్‌లోని పలు ప్రాంతాల నుంచి టాంపనిస్ సెంట్రల్ పార్క్ వద్దకు బస్సులు ఏర్పాటు చేశామని నిర్వాహకులు వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని