రాజమహేంద్రవరంలో హర్షకుమార్‌ నిరసన దీక్ష

తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో శిరోముండనం వ్యవహారంలో అసలైన దోషులను పట్టుకోవాలని డిమాండ్‌ చేస్తూ మాజీ ఎంపీ హర్షకుమార్‌ బాధితుడు...

Updated : 25 Jul 2020 13:41 IST

రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో శిరోముండనం వ్యవహారంలో అసలైన దోషులను పట్టుకోవాలని డిమాండ్‌ చేస్తూ మాజీ ఎంపీ హర్షకుమార్‌ బాధితుడు ప్రసాద్‌తో కలిసి ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. రాజమహేంద్రవరంలోని ఆయన నివాసంలో హర్షకుమార్‌ దీక్షకు కూర్చున్నారు.

ఈ వ్యవహారంలో కాల్‌ డేటా ద్వారా పోలీసులు నిందితులను పట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎవరికి వారు తమ ఇళ్లలోనే కూర్చుని దీక్షకు మద్దతు  తెలపాలని హర్షకుమార్‌ పిలుపునిచ్చారు. తెలుగుదేశం, కాంగ్రెస్‌, భాజపా, జనసేన, వామపక్షాలు తమకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. శిరోముండనం ఘటనతో పాటు కోరుకొండ మైనర్‌ బాలిక సామూహిక అత్యాచారం, చీరాలలో పోలీసుల లాఠీ దెబ్బలకు మృతి చెందిన యువకుడితో పాటు దళితులపై జరుగుతున్న దాడులకు సంబంధించి న్యాయం చేయాలని త్వరలోనే రాష్ట్రపతిని కలుస్తామని హర్షకుమార్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని