
Published : 30 Oct 2020 01:24 IST
గీతం వర్సిటీపై విజయసాయిరెడ్డి ఫిర్యాదు
అమరావతి: యూజీసీ నిబంధనలను విశాఖలోని గీతం విశ్వవిద్యాలయం అతిక్రమించిందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి, యూజీసీ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేస్తూ ఆయన లేఖ రాశారు. గీతం యాజమాన్యం నిబంధనలు ఉల్లంఘించినందున వర్సిటీ హోదాను ఉపసంహరించాలని.. వాస్తవాలు తెలుసుకునేందుకు సత్వరమే విచారణ జరపాలని విజయసాయిరెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం భూములను గీతం వర్సిటీ ఆక్రమించిందని, ఈ వ్యవహారంపై విశాఖ ఆర్డీవో విచారణ జరిపారని తెలపారు. పలు ఉల్లంఘనల దృష్ట్యా ఆ వర్సిటీకి నోటీసులు జారీ చేయాలని విజయసాయిరెడ్డి కోరారు.
Tags :