కొడాలి నానికి చరిత్ర తెలియదా?:పరిపూర్ణానంద

తిరుమల డిక్లరేషన్‌ వ్యవహారంలో ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సరికాదని శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణానంద స్వామి అన్నారు

Published : 23 Sep 2020 15:09 IST

హైదరాబాద్‌: తిరుమల డిక్లరేషన్‌ వ్యవహారంలో ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సరికాదని శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణానంద స్వామి అన్నారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన మంత్రి విచిత్రంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తిరుమల చరిత్ర ఏనాటిది..?నాని చరిత్ర ఏపాటిది?అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌ మౌనంతో ఆయనే మాట్లాడిస్తున్నారనే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే అవకాశముందని పరిపూర్ణానంద చెప్పారు. మంత్రి వ్యాఖ్యలతో ప్రభుత్వానికి చాలా ప్రమాదమన్నారు. ‘‘హిందూ దేవాలయాలపై మాట్లాడేందుకు మీకు ఏం హక్కుంది? కొడాలి నానికి చట్టాలు, చరిత్ర తెలియదా?’’ అని ప్రశ్నించారు. ప్రభుత్వం, అధికారులు ఎవరూ దేవాలయాల జోలికి రావొద్దని పరిపూర్ణానంద కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని