Alla Ramakrishna Reddy: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా

వైకాపాకు చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తన పదవికి రాజీనామా చేశారు.

Updated : 11 Dec 2023 17:03 IST

అమరావతి: వైకాపాకు గట్టి షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తన పదవికి రాజీనామా చేశారు. వైకాపా సభ్యత్వానికీ రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే పదవికి స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేసిన ఆర్కే.. స్పీకర్‌ కార్యాలయానికి వెళ్లి సభాపతి కార్యదర్శికి ఆ లేఖను అందజేశారు. మంగళగిరి వైకాపా ఇన్‌ఛార్జ్‌గా గంజి చిరంజీవికి ఆ పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలోనే ఆర్కే అసంతృప్తికి గురై రాజీనామా చేసినట్లు సమాచారం.

రాజీనామా అనంతరం ఆర్కే మీడియాతో మాట్లాడారు. ‘‘ఎమ్మెల్యే పదవికి, వైకాపాకు వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశా. స్పీకర్‌ కార్యాలయంలో లేఖను అందజేశాను. దీన్ని ఆమోదించాలని స్పీకర్‌ను కోరా. రాజీనామాకు గల కారణాలను త్వరలో తెలియజేస్తా’’అని ఆయన చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని