Amit Shah: తెలంగాణలో పదికి పైగా ఎంపీ సీట్లే లక్ష్యం: అమిత్ షా

తెలంగాణ ప్రజలు ఒక కుటుంబ పాలన నుంచి విముక్తి పొంది మరో కుటుంబం చేతుల్లో పడ్డారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) వ్యాఖ్యానించారు.

Updated : 28 Dec 2023 20:48 IST

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలు ఒక కుటుంబ పాలన నుంచి విముక్తి పొంది మరో కుటుంబం చేతుల్లో పడ్డారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను (Congress) గెలిపించలేదని.. భారాసను ఓడించారని అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన భాజపా (BJP) రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో అమిత్ షా పాల్గొని.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు 35 శాతానికి పైగా ఓట్లు, పదికి పైగా ఎంపీ సీట్లు లక్ష్యంగా పని చేయాలన్నారు. పార్టీ నాది.. అనే రీతిలో ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు. కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే దేశంలో 400పైగా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా కేవలం ఒక్కసీటు మాత్రమే సాధించిందని.. ఈ దఫా ఎనిమిది స్థానాల్లో గెలిచామన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి మరోసారి భాజపా అధికారంలోకి వస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని