Andhra News: విశాఖ ఉక్కుపై గళమెత్తిన ఏపీ ఎంపీలు.. ప్రైవేటుకే కేంద్రం మొగ్గు!

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా లోక్‌సభలో ఏపీ ఎంపీలు గళమెత్తారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయం అశాస్త్రీయమని నిలదీశారు. నష్టాల కారణం చూపి ప్లాంట్‌ను

Updated : 23 Mar 2022 14:38 IST

దిల్లీ: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా లోక్‌సభలో ఏపీ ఎంపీలు గళమెత్తారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయం అశాస్త్రీయమని నిలదీశారు. నష్టాల కారణం చూపి ప్లాంట్‌ను ప్రైవేట్‌ సంస్థలకు ధారాదత్తం చేయాలనుకునే ప్రయత్నాలను మానుకోవాలని కేంద్రాన్ని కోరారు. గనులు కేటాయించి స్టీల్‌ ప్లాంట్‌ను లాభాల బాట పట్టించేందుకు కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయం సరికాదని దీనిపై పునరాలోచించాలని తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. స్టీల్‌ప్లాంట్‌కు కాప్టివ్‌ మైన్స్‌ లేవని.. మైన్స్‌ కేటాయిస్తే లాభాలు అధికంగా వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

ఉద్యమం చేసి సాధించుకున్న స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ సరికాదని ఎంపీ కేశినేని నాని అన్నారు. సెయిల్‌ను కాకుండా విశాఖ ఉక్కును మాత్రమే ప్రైవేటీకరణ చేయడమేంటని ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయంపై ప్రధాని మోదీ పునరాలోచించాలని వైకాపా ఎంపీ మార్గాని భరత్‌ విజ్ఞప్తి చేశారు. కాప్టివ్‌ మైన్స్‌ కావాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. ఎంపీలకు బదులిచ్చిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్‌ సింగ్‌ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించనప్పటికీ కొంత కాలం పరిశ్రమ లాభాల బాటలో పయనించిందని బదులిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటీకరణే ఉత్తమ నిర్ణయమని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు