Andhra News: సీఎం జగన్‌ జట్టులో కొత్త మంత్రులు వీరే..

ఏపీ నూతన మంత్రివర్గం రేపు ఉదయం కొలువుదీరనుంది. మూడురోజులుగా దీనిపై కసరత్తు చేస్తోన్న సీఎం జగన్‌..

Updated : 10 Apr 2022 23:21 IST

అమరావతి: ఏపీ నూతన మంత్రివర్గం రేపు ఉదయం కొలువుదీరనుంది. మూడురోజులుగా దీనిపై కసరత్తు చేస్తోన్న సీఎం జగన్‌.. ఇవాళ తుది జాబితాను ఖరారు చేశారు. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు మంత్రులుగా ఎంపిక చేసిన వారికి సీఎం కార్యాలయ అధికారులు ఫోన్‌ చేసి సమాచారాన్ని తెలపనున్నారు. రేపు ఉదయం 11.31 గంటలకు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం పక్కనే ఉన్న పార్కింగ్‌ స్థలంలో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

మంత్రి వర్గం జాబితా

* శ్రీకాకుళం - ధర్మాన ప్రసాదరావు (వెలమ)
  సీదిరి అప్పలరాజు (మత్స్యకార)

* విజయనగరం - బొత్స సత్యనారాయణ (తూర్పు కాపు)

* పార్వతీపురం - రాజన్న దొర (ఎస్టీ)

* అనకాపల్లి : గుడివాడ అమర్‌నాథ్‌ (కాపు)
 ముత్యాలనాయుడు (కొప్పుల వెలమ)

* కాకినాడ జిల్లా - దాడిశెట్టి రాజా (కాపు)

* కోనసీమ జిల్లా - పినిపె విశ్వరూప్‌ (ఎస్సీ)
 చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (బీసీ - శెట్టి బలిజ)

* తూర్పుగోదావరి జిల్లా - తానేటి వనిత (మాదిగ - ఎస్సీ)

* పశ్చిమ గోదావరి జిల్లా - కారుమూరి నాగేశ్వరరావు (యాదవ - బీసీ)
  కొట్టు సత్యనారాయణ (కాపు)

* కృష్ణా జిల్లా - జోగి రమేష్ (గౌడ - బీసీ)

* పల్నాడు జిల్లా - అంబటి రాంబాబు (కాపు)
* బాపట్ల జిల్లా- మేరుగ నాగార్జున (ఎస్సీ)
* గుంటూరు- విడదల రజని (బీసీ)

ప్రకాశం జిల్లా: ఆదిమూలపు సురేశ్‌ (ఎస్సీ)

* నెల్లూరు జిల్లా - కాకాణి గోవర్ధన రెడ్డి (ఓసీ - రెడ్డి)

కడప జిల్లా - అంజద్‌ బాషా (మైనార్టీ)

* నంద్యాల జిల్లా - బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి (ఓసీ - రెడ్డి)
* కర్నూలు జిల్లా:  గుమ్మనూరు జయరాం (బీసీ - బోయ)

చిత్తూరు జిల్లా - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (ఓసీ - రెడ్డి)
 నారాయణస్వామి (ఎస్సీ)
 ఆర్‌ కే రోజా (ఓసీ - రెడ్డి)

* అనంతపురం - ఉషాశ్రీచరణ్‌ (కురుమ - బీసీ)
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని