BRS: భారాస మహారాష్ట్ర ఇన్‌ఛార్జిగా కల్వకుంట్ల వంశీధర్‌రావు

భారాస మహారాష్ట్ర ఇన్‌ఛార్జిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్న కుమారుడు కల్వకుంట్ల వంశీధర్‌రావును నియమించారు.

Updated : 28 Jul 2023 21:53 IST

హైదరాబాద్‌: భారాస మహారాష్ట్ర ఇన్‌ఛార్జిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్న కుమారుడు కల్వకుంట్ల వంశీధర్‌రావును నియమించారు. కేసీఆర్‌ ఛైర్మన్‌గా 15 మందితో తాత్కాలిక స్టీరింగ్‌ కమిటీని భారాస ఏర్పాటు చేసింది. కమిటీ వివరాలను భారాస జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాంషు తివారీ వెల్లడించారు. 

మహారాష్ట్రలోని నలుగురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలతో పాటు వంశీధర్‌రావు కూడా స్టీరింగ్‌ కమిటీ సభ్యులుగా ఉన్నారు. మహారాష్ట్రలోని ఆరు రీజియన్లకు కో ఆర్డినేటర్లను, సహ కోఆర్డినేటర్లను భారాస నియమించింది. ఔరంగబాద్‌ కు సోమనాథ్ థోరాట్, నిఖిల్ దేశ్ ముఖ్, నాగపూర్‌కు మాజీ ఎమ్మెల్యే చరణ్ వగ్మారే, నాసిక్ కు నానా బచ్చావ్, పుణెకు బీజే దేశ్ ముఖ్, ముంబయికి విజయ్ మొహితే కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారని భారాస జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాంషు తివారీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని