Atchannaidu: జగన్ గొడ్డలిపోటును మంత్రులు వారసత్వంగా తీసుకున్నారు: అచ్చెన్న

సీఎం జగన్ రెడ్డి గొడ్డలిపోటును రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు వారసత్వంగా తీసుకున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. తెదేపా సీనియర్ నేత పొల్నాటి శేషగిరిరావుపై ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అనుచరులు గొడ్డళ్లతో దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

Published : 17 Nov 2022 15:03 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గొడ్డలిపోటును రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు వారసత్వంగా తీసుకున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తెదేపా సీనియర్ నాయకుడు పొల్నాటి శేషగిరిరావుపై స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అనుచరులు గొడ్డళ్లతో దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను నిలదీస్తోన్న తెదేపా నేతలను అణిచివేయడంలో భాగంగానే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తుని నియోజకవర్గంలో ఒక వర్గానికి అన్యాయం చేస్తున్న వైకాపా చర్యలను నిలదీస్తున్నందుకే శేషగిరిరావును చంపడానికి ప్రయత్నించారని మండిపడ్డారు. హత్యలు, దాడులు చేసి బెదిరించే ఈ దుష్ట ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసి, ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకోవాలన్నారు. హత్యాయత్నం చేసిన వారిని, చేయించిన వారిని కటకటాల వెనక్కి పంపే వరకు పోరాడుతామని అచ్చెన్న తేల్చి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని