కుల సంఘాలను కేసీఆర్‌ మోసం చేశారు: బండి

గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఐఎస్‌ సదన్‌లో ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ..

Updated : 27 Nov 2020 15:22 IST

హైదరాబాద్‌: గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఐఎస్‌ సదన్‌లో ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కుల సంఘాల భవనాలు నిర్మిస్తామని చెప్పి కేసీఆర్‌ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. 

ఇప్పటి వరకు ఎన్ని కుల సంఘాలకు భవనాలు నిర్మించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికలప్పుడు మాత్రమే కేసీఆర్‌కు కుల సంఘాలు గుర్తుకు వస్తాయని విమర్శించారు. కులాల పేరుతో, వర్గాలతో చీల్చే ప్రయత్నం చేయకుండా అందరూ ధర్మం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. భాజపాను గెలిపిస్తే ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. తెరాస మళ్లీ అధికారంలోకి వస్తే బీఆర్‌ఎస్‌ తెస్తారని విమర్శించారు. తెరాస పోవాలంటే భాజపాకే ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో హైదరాబాద్‌ను డల్లాస్‌ చేస్తామని కేసీఆర్‌ చెప్పారు.. చేశారా? అని ప్రశ్నించారు. పేదలు వర్షాలకు తడుస్తుంటే.. సీఎం కేసీఆర్‌ రూ.100  కోట్లతో ప్రగతిభవన్‌ కట్టుకున్నారని ఆరోపించారు. రిజర్వేషన్ల పేరిట బీసీలను మోసం చేశారని విమర్శించారు. ఈనెల 28న కేసీఆర్‌ చెప్పే పిట్టకథలు నమ్మితే మరోసారి మోసపోతారని ఓటర్లకు సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని