ఎంతకాలం ఈ హత్యా రాజకీయాలు.. మార్పునకు ప్రజలు నాంది పలకాలి: బండి సంజయ్‌

తెలంగాణలో హత్యా రాజకీయాలు ఇంకా ఎన్ని రోజులు భరిస్తామని.. 2023లో మార్పునకు ప్రజలు నాంది పలకాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా గద్వాల జిల్లా తేరు మైదానంలో నిర్వహించిన...

Updated : 21 Apr 2022 22:32 IST

గద్వాల: తెలంగాణలో హత్యా రాజకీయాలు ఇంకా ఎన్ని రోజులు భరిస్తామని.. 2023లో మార్పునకు ప్రజలు నాంది పలకాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా గద్వాల జిల్లా తేరు మైదానంలో నిర్వహించిన భాజపా బహిరంగ సభలో బండి సంజయ్‌ మాట్లాడారు. ఆర్డీఎస్‌ అంశంలో తెలంగాణ పట్ల అన్యాయాన్ని పరిష్కరించమని కేంద్రాన్ని కోరగా.. 6 నెలల్లో ఆర్డీఎస్‌ ద్వారా నీళ్లిస్తామని స్పష్టం చేసిందన్నారు. కేఆర్‌ఎంబీ ద్వారా ఆర్డీఎస్‌ హెడ్‌రెగ్యులేటరీ మరమ్మతులు చేయమని, టెలిమెట్రీ యంత్రాలు అమర్చమని కేంద్రం చెప్పిందన్నారు. సీఎం కేసీఆర్‌ చేయలేని పని కేంద్రం చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రానికి 2021 వరకు కేంద్ర ప్రభుత్వం రూ.1.68 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. మరో రూ.1.50 లక్షల కోట్లు సంక్షేమ పథకాల రూపంలో వచ్చాయని చెప్పారు. తెలంగాణకు నిధులు ఇస్తున్న ప్రధాని మోదీని విమర్శిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న భాజపా కార్యకర్త సాయి గణేశ్‌ త్యాగాన్ని వృథా కానివ్వబోమని.. బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. రామాయంపేట, ఖమ్మం, కోదాడ అఘాయిత్యాలకు తెరాసనే కారణమని బండి సంజయ్‌ ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని