బిహార్‌ : 11 గంటలకు 19.74% పోలింగ్

బిహార్‌లో తుది విడత ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రారంభంలో కాస్త తక్కువ శాతం పోలింగ్‌ నమోదైనప్పటికీ క్రమంగా పుంజుకుంటోంది. 11 గంటల వరకు 19.74 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్‌ జరుగుతున్న జిల్లాలను ఓసారి పరిశీలిస్తే..

Published : 07 Nov 2020 12:54 IST

పట్నా: బిహార్‌లో తుది విడత ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రారంభంలో కాస్త తక్కువ శాతం పోలింగ్‌ నమోదైనప్పటికీ క్రమంగా పుంజుకుంటోంది. 11 గంటల వరకు 19.74 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్‌ జరుగుతున్న జిల్లాలను ఓసారి పరిశీలిస్తే.. ఇప్పటి వరకు పశ్చిమ చంపారన్‌లో 19.14 శాతం, తూర్పు చంపారన్‌లో 20.16 శాతం, సీతామర్హిలో 19.71 శాతం, మధుబాణిలో 19.71 శాతం, సుపాల్‌లో 21 శాతం, అరారియాలో 24.87 శాతం, కిషన్‌గంజ్‌లో 19,63 శాతం, పూర్ణియాలో 20.32 శాతం పోలింగ్‌ నమోదైంది.

మరోవైపు  పూర్ణియాలోని కస్బా అసెంబ్లీ పరిధిలో స్థానికులు బీఎస్‌ఎఫ్‌ జవాన్‌తో తగాదాకు దిగారు. తమ మద్దతుదారుడిని తీవ్రంగా కొట్టాడనే కారణంతో ఆయన్ను చుట్టుముట్టారు. దీంతో స్థానిక పోలింగ్‌ కేంద్రంలో అధికారులు పోలింగ్‌ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. దాదాపు రెండు గంటల తర్వాత తిరిగి ప్రారంభించారు.  సహర్ష శాసనసభ స్థానం ఆర్జేడీ అభ్యర్థి, మాజీ ఎంపీ ఆనంద్‌ మోహన్‌ భార్‌ లవ్‌లీ ఆనంద్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని