Maharashtra Crisis: మహారాష్ట్రలో పరిస్థితి షాకింగ్‌లా ఉంది: దీదీ

మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభంపై తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) స్పందించారు. ...

Published : 23 Jun 2022 19:29 IST

కోల్‌కతా: మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభంపై తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) స్పందించారు. మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా ప్రయత్నించడం అనైతికం, రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాషాయ పార్టీ ఉద్దేశపూర్వకంగానే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచాలని చూస్తోందన్నారు. భాజపా సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సమాఖ్య నిర్మాణాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. మహారాష్ట్రలో పరిస్థితి షాకింగ్‌లా ఉందన్న దీదీ.. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పునకు, సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు న్యాయం జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. మరోవైపు, ఆ ఎమ్మెల్యేలను భాజపా బెంగాల్‌కు పంపాలని, తాము మంచి ఆతిథ్యం అందిస్తామని దీదీ వ్యాఖ్యానించారు. తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలను గువాహటికి పంపించి వరదలతో సతమతమవుతున్న అస్సాం ప్రభుత్వాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం.. వారిని బెంగాల్‌కు పంపితే మంచి ఆతిథ్యం ఇవ్వడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని కూడా జాగ్రత్తగా కాపాడతామంటూ మమత చమత్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని