Andhra News: ఉండవల్లితో భేటీ.. మా సీక్రెట్స్‌ మాకున్నాయ్‌: బ్రదర్‌ అనిల్‌

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను క్రైస్తవ మత ప్రచారకుడు, వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌ కుమార్‌

Updated : 26 Feb 2022 06:05 IST

రాజమహేంద్రవరం: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను క్రైస్తవ మత ప్రచారకుడు, వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ కలిశారు. రాజమహేంద్రవరంలోని ఉండవల్లి నివాసంలో ఇరువురి మధ్య సుమారు గంటసేపు సమావేశం జరిగింది. అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. 

తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులపై అరుణ్‌కుమార్‌తో చర్చించినట్లు బ్రదర్‌ అనిల్‌ తెలిపారు. తనకు రాజకీయాలు తెలియవని.. వాటి గురించి కొంచెం నేర్చుకోవడానికి వచ్చినట్లు చెప్పారు.  తమ సీక్రెట్స్‌ తమకు ఉన్నాయని.. సమయం వచ్చినపుడు అవి బయటకు వస్తాయని అనిల్‌ వ్యాఖ్యానించారు. పాత పరిచయాలతో అన్ని విషయాలూ మాట్లాడుకున్నామని ఉండవల్లి అరుణ్‌కుమార్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని