CBI-MP Avinash: అవినాష్‌ అరెస్టుకు రంగం సిద్ధం?కర్నూలు ఎస్పీకి సీబీఐ లిఖితపూర్వక లేఖ?

వైకాపా ఎంపీ అవినాష్‌ రెడ్డిని అరెస్టు చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో కర్నూలులో హైటెన్సన్‌ వాతావరణం నెలకొంది. అవినాష్‌ను అరెస్టు చేస్తారనే ప్రచారం జరగడంతో విశ్వభారతి ఆస్పత్రి వద్దకు వైకాపా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. 

Published : 22 May 2023 11:02 IST

కర్నూలు: వైకాపా ఎంపీ అవినాష్‌ రెడ్డిని అరెస్టు చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో కర్నూలులో హైటెన్సన్‌ వాతావరణం నెలకొంది. అవినాష్‌ను అరెస్టు చేస్తారనే ప్రచారం జరగడంతో విశ్వభారతి ఆస్పత్రి వద్దకు వైకాపా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా ఆస్పత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్‌ అవినాష్‌ రెడ్డిని అరెస్టు చేస్తున్నట్లు కర్నూలు ఎస్పీకి సీబీఐ అధికారులు లిఖిత పూర్వకంగా లేఖ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో ఆస్పత్రి వద్దకు సీబీఐ అధికారులు చేరుకోనున్నట్లు సమాచారం. ఎస్పీ కార్యాలయం దగ్గర పోలీస్ ఫోర్స్ కోసం సీబీఐ అధికారులు వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆస్పత్రి చుట్టూ ఎంపీ అవినాష్‌రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని