Chandrababu: భక్తులు అవస్థలు పడుతుంటే తితిదే ఏం చేస్తోంది: చంద్రబాబు

తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు పడుతున్న కష్టాలపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది భక్తులు గంటల తరబడి పసిబిడ్డలతో మండుటెండలో అవస్థలు పడుతుంటే తితిదే ఏం చేస్తోందని ప్రశ్నించారు....

Published : 12 Apr 2022 14:37 IST

అమరావతి: తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు పడుతున్న కష్టాలపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది భక్తులు గంటల తరబడి పసిబిడ్డలతో మండుటెండలో అవస్థలు పడుతుంటే తితిదే ఏం చేస్తోందని ప్రశ్నించారు. భక్తులకు తాగు నీరు, క్యూ లైన్లలో నీడ ఉండేలా చూడలేరా? అని నిలదీశారు.

తితిదే చేతగాని నిర్ణయాలు శ్రీవారిని భక్తులకు దూరం చేసేలా ఉన్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శనాలు, వసతికి సంబంధించి చాలా రోజులుగా అధికారుల అలసత్వం కనిపిస్తోందని మండిపడ్డారు. తిరుమలలాంటి ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఆదాయ వనరు కోణంలో చూడటం సరికాదన్నారు. కొండపైకి వెళ్లడానికి కూడా ఆంక్షలు విధించడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆక్షేపించారు. భక్తులకు తితిదే క్షమాపణలు చెప్పాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని