Chandrababu: జగన్‌ సింగిల్‌గా రావట్లేదు.. శవాలతో వస్తున్నారు: చంద్రబాబు

జెండాలు వేరయినా అజెండా ఒక్కటేనని, రాష్ట్రం కోసం త్యాగాలు చేసి.. కలిసి ముందుకొచ్చామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. 

Updated : 10 Apr 2024 22:43 IST

 

నిడదవోలు: జెండాలు వేరయినా అజెండా ఒక్కటేనని, రాష్ట్రం కోసం త్యాగాలు చేసి.. కలిసి ముందుకొచ్చామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. నిడదవోలు ‘ప్రజాగళం’ సభలో జనసేనాని పవన్‌, భాజపా ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘జగన్‌ చేసిన విధ్వంసం, అప్పులకు రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉంది. కొన ఊపిరిపై ఉన్న రాష్ట్రాన్ని ఎన్డీయే ఆక్సిజన్‌లా బతికిస్తుంది. అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణే మా ధ్యేయం. రాజధాని, పోలవరం సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలి. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారం అవసరం. గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే శక్తి ఏన్డీయేకి ఉంది

రాష్ట్రంలో ఒక్క రైతు అయినా బాగుపడ్డారా? పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చారా?వరద సాయం చేశారా? ఎక్కువ అప్పులు చేసిన రైతులు మన రాష్ట్రంలోనే ఉన్నారు. నిత్యావసరాల ధరలు పెంచారు. వైకాపా ఎమ్మెల్సీ తన డ్రైవర్‌ను చంపి డోర్‌ డెలివరీ చేశారు. వైకాపా ప్రభుత్వం వస్తే అందరినీ చంపి డోర్‌ డెలివరీ చేస్తారు. జగన్‌ సింగిల్‌గా రావట్లేదు.. శవాలతో వస్తున్నారు. జగన్‌ గొడ్డలి వేటుకు బలి కానివారు ఉన్నారా? పింఛన్ల విషయంలోనూ శవరాజకీయాలు చేశారు. టికెట్లు ఇస్తామన్నా తీసుకోకుండా వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు పారిపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు