Andhra News: వాటిని గమనించే జగన్‌ ముందస్తుకు వెళ్లాలనుకుంటున్నారు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వచ్చినా.. పార్టీ శ్రేణులు అందుకు సిద్ధంగా ఉండాలని తెదేపా అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రజల్లో రోజు రోజుకూ ప్రభుత్వంపై వ్యతిరేకత

Published : 18 May 2022 01:37 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వచ్చినా.. పార్టీ శ్రేణులు అందుకు సిద్ధంగా ఉండాలని తెదేపా అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రజల్లో రోజు రోజుకూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని.. ప్రభుత్వాన్ని ఎంతో కాలం నడపలేమనే విషయం సీఎం జగన్‌కు అర్థమవుతోందని చెప్పారు. పార్టీ గ్రామ, మండల కమిటీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బాదుడే బాదుడు, సభ్యత్వ నమోదు, ఓటర్ వెరిఫికేషన్, మహానాడు తదితర అంశాలపై పార్టీ శ్రేణులతో సమీక్షించారు.

‘‘జగన్ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు బూటకమేనని ప్రజలకు అర్థమవుతోంది. ఆ వర్గం.. ఈ వర్గం అని లేకుండా అందరిలోనూ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కనిపిస్తోంది. వీటన్నింటినీ గమనించిన సీఎం జగన్.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీపైనే ఆశలు పెట్టుకున్నారు. గ్రామాల్లో తెదేపాకు స్వాగతాలు, గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వైకాపా నేతలకు నిలదీతలే ఇందుకు నిదర్శనం. వైకాపా ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా తెదేపా నేతలు గ్రామ స్థాయి వరకు ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా ఇంటింటికీ వెళ్లాలి. నాయకులు అనే వారు నిత్యం ప్రజలకు దగ్గరగా ఉండాలి. జగన్ ప్రభుత్వంపై వచ్చిన తీవ్ర వ్యతిరేకత అన్ని వర్గాల ప్రజల్లో, అన్ని ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తోంది’’ అని చంద్రబాబు తెలిపారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా తన పర్యటనల్లో వస్తున్న స్పందనను ఈ సందర్భంగా పార్టీ నేతలతో చంద్రబాబు పంచుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు