
సంక్షోభంలో పుదుచ్చేరి ప్రభుత్వం?
దిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. నెలరోజుల వ్యవధిలో అధికార కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో పార్టీ బలం మెజారిటీ మార్కు దిగువకు చేరింది. దీంతో పుదుచ్చేరిలో రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. కాగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి పార్టీ నేతలతో చర్చించేందుకు.. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ బుధవారం పుదుచ్చేరికి రానున్న నేపథ్యంలో వీరి రాజీనామాలు చోటుచేసుకోవడం గమనార్హం.
నమశివాయం, తీప్పయింజన్ అనే ఇద్దరు ఎమ్మెల్యేలు జనవరి 25న రాజీనామా చేయగా.. మిగితా ఇద్దరిలో ఒకరు సోమవారం, మరొకరు ఈరోజు తాజాగా రాజీనామా చేశారు. 33 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీలో మూడు నామినేటెడ్ స్థానాలు. 2016లో 30 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. కాంగ్రెస్ 15 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు నలుగురు రాజీనామా చేయడంతో ఆ పార్టీ బలం 11కిచేరింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.