అపాయింట్‌మెంట్‌ ఇస్తే సీఎంని కలుస్తా: జగ్గారెడ్డి

సంగారెడ్డిలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకొని కళాశాల వచ్చేలోపు

Published : 01 Jan 2021 01:42 IST

హైదరాబాద్‌: సంగారెడ్డిలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకొని కళాశాల వచ్చేలోపు రూ.వెయ్యి కోట్లు వెచ్చించి భవన నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌ సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కళాశాల కోసం జనవరి వరకు వేచిచూసి ఆ తర్వాత పోరాటం చేస్తానని హెచ్చరించారు.

‘‘సంగారెడ్డిలో మెడికల్‌ కళాశాల వ్యవహారం ఏడేళ్లుగా పెండింగ్‌లో ఉంది. 2015లో సంగారెడ్డి మెడికల్‌ కళాశాల ప్రతిపాదనను సిద్దిపేటకు తీసుకెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం మాటిచ్చారు. దిల్లీకి వెళ్లినప్పుడు కనీసం మెడికల్‌ కళాశాల గురించి అయినా అడగొచ్చు కదా? కళాశాల విషయం సీఎం మర్చిపోయారు. సంగారెడ్డి ఆస్పత్రికి పఠాన్ చెరు, అందోల్‌ నియోజకవర్గ ప్రజలు కూడా వస్తారు. సీఎం అపాయింట్‌మెంట్‌ ఇస్తే కలవడానికి సిద్ధంగా ఉన్నా. 2023లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు కళాశాల ఏర్పాటు చేయకపోతే అప్పుడు మా సీఎంతోనే మంజూరు చేయిస్తా’అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని